SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కేసీఆర్‌పై అప్పుడలా.. ఇప్పుడిలా.. జీవన్‌రెడ్డి రాజకీయ వైఖరిపై మంత్రి అడ్లూరి ఫైర్‌!

Jagtial News: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ BRS నేత జీవన్‌రెడ్డి రాజకీయ వైఖరిపై ఊహించని స్థాయిలో మడ్డిపడ్డారు.. మాజీ సీఎం కేసీఆర్‌ను చాలా సార్లు విమర్శించి.. ఇప్పుడు కీర్తించడం ఏంటని ప్రశించారు. జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 06:42 PM IST | Updated: Oct 16, 2026, 06:43 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Jagtial Telugu News: గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతూ వస్తున్నాయి.. ఈ రోజు నూకపల్లి ఇందిరమ్మ కాలనీలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భూమిపూజ చేశారు. ఆ తర్వాత నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీ ప్రజల కోసం ఏర్పాటు చేసిన RTC బస్సు సర్వీసును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ నేతలతో పాటు అధికారులతో కలిసి మంత్రి స్వయంగా బస్సులో ప్రయాణించారు.

అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి రాజకీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా.. మీడియా ముఖంగా KCR‌ను దయ్యం అని విమర్శించిన జీవన్‌రెడ్డి.. ఇప్పుడు అదే కేసీఆర్‌ను దేవుడిగా కీర్తించడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి.. దాచుకోవడానికే KCR వచ్చారని గతంలో జీవన్‌రెడ్డి మాట్లాడిన మాటలను ప్రజలెవరూ.. అస్సలు మర్చిపోలేదని ఈ సమావేశంలో గుర్తు చేశారు.. ఈ రాష్ట్రంలో కేసీఆర్‌ను జీవన్‌రెడ్డి తిట్టినన్ని సార్లు మరెవరూ తిట్టలేదని.. రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు నేతలు తమ గత వైఖరిని.. మాట్లాడిన మాటలను గుర్తుపెట్టుకోవాలని తెలిపారు.

CM రేవంత్‌రెడ్డి పాలనపై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డి PCC అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. సీనియర్ల సేవలను వినియోగించుకుంటామని మంచి గౌరవం ఇచ్చారని చెబుతూ వచ్చారు. ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఓడిపోయినా.. కేబినెట్‌లోకి తీసుకుంటామని CM స్వయంగా ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తవించారు.

గత BRS ప్రభుత్వంలో మంత్రులకు కనీసం CM కేసీఆర్‌ను కలిసే వెసులుబాటు కూడా ఉండేది.. కాదన్నారు. కానీ ప్రజాపాలనలో తాను సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దాదాపు 100 నుంచి 150 సార్లు నేరుగా కలిశానని తెలిపారు. CM తనను పక్కన కూర్చోబెట్టుకుని.. భోజనం చేస్తూ.. అనే శాఖాపరమైన నిర్ణయాలతో పాటు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారని వెల్లడించారు. రైతుల పొలాలు ఎక్కడైనా ఎండిపోతే ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలని.. తమ ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆదేశించిందని.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న తమ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లోనూ అద్భుతమైన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మంత్రి అడ్లూరి ఈ సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES