SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మండపంలోనే వినాయక నిమజ్జనం.. ఆ మట్టితో పొలాలకు ఎరువు!

Dubbaka Eco-friendly Ganesh Visarjan: పర్యావరణ పరిరక్షించేందుకు దుబ్బాక పట్టణంలోని యువ వినూత్నంగా ఆలోచించారు. వారు ప్రతిష్టించిన మట్టి విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేసి.. వినాయకుడు కరిగిపోయిన తర్వాత వచ్చిన మట్టిని పొలంలో చల్లారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు వారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచించేలా చేస్తోంది.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 21, 2026, 12:01 PM IST | Updated: Sep 21, 2026, 12:03 PM IST
Image Credit: మండపంలోనే వినాయక నిమజ్జనం.. ఆ మట్టితో పొలాలకు ఎరువు!
Join

Dubbaka Eco-friendly Ganesh Visarjan: వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సిద్ధిపేట జిల్లా దుబ్బాకకు సంబంధించిన యువత సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చూట్టారు. ఊరేగింపులు, DJ సౌండ్స్‌, చెరువుల్లో కాలుష్యం లేకుండా అత్యంత సాదాసీదాగా గణనాథుడికి వీడ్కోలు పలికి అందరి దృష్టిని ఆకర్శించింది.. ప్రతిష్టించిన మండపంలోనే విగ్రహాన్ని కరిగించి.. ఆ మట్టిని పొలాలకు ఎరువుగా వినియోగించి అదర్శంగా నిలిచింది..

దుబ్బాక పట్టణంలోని తిలక్ యూత్ అసోసియేషన్ సభ్యులు పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావించారు. రసాయనాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టితో తయారు చేసిన వినాయకుడిని మండపంలో ప్రతిష్టించారు.  అయితే, వినాయక నిమజ్జనం సందర్భంగా సాధారణంగా చెరువులు లేదా కుంటలకు వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీ.. కానీ, ఈ యువకులు జలవనరులు కలుషితం కాకుండా ఉండాలనే దృక్పథంతో వినూత్నంగా ఆలోచించారు.

మండపం వద్దే వినాయకుడిని నిమజ్జనానికి సిద్ధం చేసుకుని.. బిందెలతో తెచ్చిన మంచి నీటిని విగ్రహంపై ధారగా పోశారు. భక్తిశ్రద్ధల నడుమ మండపంలోనే ఆ మట్టి వినాయకుడు నీటిలో కరిగిపోయాడు. జై గణేశా అనే నామస్మరణతో నీళ్లు పోస్తూ.. భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఈ వినూత్న నిమజ్జనం కేవలం కాలుష్యాన్ని అరికట్టడంతోనే ఆగలేదు.. విగ్రహం కరిగిపోయిన తర్వాత మిగిలిన సారవంతమైన మట్టిని, నీటిని వృథా చేయకుండా ఆ యువకులు అక్కడే దానిని సంచీల్లో ఎత్తుకుని.. ఆ పవిత్రమైన మట్టిని తమ పంట పొలాలకు, చెట్లకు సహజ ఎరువుగా వినియోగించారు. దైవ ప్రసాదంగా భావించే ఆ మట్టిని పొలంలో చల్లడం వల్ల పంటలకు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు..

ప్రస్తుతం భారీ విగ్రహాలతో పాటు హానికర రసాయనాల వల్ల నదులు, చెరువులు నాశనమవుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు సమాజానికి ఎంతో అవసరమని తిలక్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని.. రాబోయే రోజుల్లో ప్రతి కాలనీలోనూ మట్టి గణపతులను ప్రతిష్టించి.. మండపాల్లోనే నిమజ్జనం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
 

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES