Jagtial: నా భార్య, పిల్లలకు మీరే దిక్కు.. BRS నేత కన్నీటి లేఖ..
Jagtial News Telugu: జగిత్యాల జిల్లాలోని ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ BRS నేత అప్పుల భారంతో EMIలు చెల్లించ లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజయకీల్లో భాగంగా ఖర్చులు విపరీతంగా చేయడం వల్ల అప్పుల పాలయ్యాయని లేఖలో పేర్కొన్నారు.
Jagtial News Telugu: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. BRS పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ అప్పుల భారం తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. పార్టీ వ్యవహారాలతో పాటు స్థానిక రాజకీయాల కోసం చేసిన ఖర్చులు, పేరుకుపోయిన EMIల ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అర్ధాంతరంగా మరణించారు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతూ వస్తోంది..
గత కొన్నేళ్లుగా BRS పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతో పాటు ఎన్నికల ఖర్చులు భరించడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాల కోసం చేసిన అప్పులు జగన్‌ను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. రోజురోజుకూ అప్పుల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడంతో పాటు చెల్లించాల్సిన EMIల భారం విపరీతంగా పెరగడంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు. ఈ క్రమంలోనే సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ఆయన ఈ ఘోర నిర్ణయం తీసుకున్నారు.
ఆత్మహత్యకు పాల్పడే... ముందు జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కన్నీటి లేఖ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. పార్టీ పనుల కోసమే తాను.. అప్పుల ఊబిలో కూరుకుపోయానని ఆ లెటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్యతో పాటు చిన్న పిల్లలకు మీరే దిక్కు.. వారిని అనాథలను చేయకండి.. అని పేర్కొంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు మాజీ MPP పొనుగోటి శ్రీనివాస్ రావులకు విజ్ఞప్తి చేశారు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని.. తన పిల్లల భవిష్యత్తును కాపాడాలని వేడుకున్నారు.
జగన్ మృతి వార్త తెలియడంతో ఎండపల్లి మండలం సహా ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ... చురుకైన రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్న జగన్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో గ్రామస్థులతో పాటు పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జగన్ రాసిన లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..