క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల మోసం.. చివరికి కిడ్నాప్.. జగిత్యాలలో 7 మంది అరెస్ట్!
Jagtial Crypto Fraud Case: క్రిప్టో కరెన్సీలో భారీ డబ్బులు పెట్టించి మోసం చేశారని బాధితులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు దాదాపు ఆరుగురిని ఆరెస్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jagtial Crypto Fraud Case In Telugu: డిజిటల్ కరెన్సీ పెట్టుబడుల వ్యవహారం చివరకు కిడ్నాప్‌కు దారితీసింది.. భారీ లాభాలు వస్తాయంటూ క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టించి మోసం చేశాడని.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ముఠాను జగిత్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రధాన నిందితుడితో సహా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు ఈ ఘటన జిల్లా వ్యప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DSP సుదర్శన్ రెడ్డి ఈ సంచలన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. జగిత్యాల రూరల్‌లోని చలిగల్‌కి చెందిన మానాల మారుతి అనే వ్యక్తి క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నడుపుతూ.. కొందరి వద్ద భారీగా పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది.. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన అకస్మాత్తుగా అదృశ్యమయిపోయాడు.. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా... ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన మారుతి భార్య.. ఫిబ్రవరి 19న జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు..
పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే.. మార్చి 15న బాధితుడు మారుతి స్వయంగా జగిత్యాల పోలీసులను ఆశ్రయించి తనకు జరిగింతా చెప్పాడు.. తనను బెజ్జంకి అనిల్ రావు అనే వ్యక్తితో కలిసి మరికొంతమంది బలవంతంగా కిడ్నాప్ చేశాడని వాపోయాడు. ఓ గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్రంగా చితకబాదారని.. భారీగా నగదు ఇవ్వాలని బెదిరించారని పోలీసులతో తెలిపారు.. అలాగే.. తాను ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని కూడా వారు చెప్పిన వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు.. తమ మాట వినకపోతే ప్రాణాలు తీస్తామని పోలీసులకు తెలిపాడు.
బాధితుడు అందించిన వాంగ్మూలం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు తెలుస్తోంది.. ప్రధాన నిందితుడు బెజ్జంకి అనిల్ రావుతో పాటు.. ఈ కిడ్నాప్ వ్యవహారంలో పాలుపంచుకున్న మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కిడ్నాప్‌లతో పాటు దాడులకు పాల్పడితే.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని DSP సుదర్శన్ రెడ్డి హెచ్చరించిన్నట్లు తెలుస్తోంది.. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.. క్రిప్టో మోసాలతో పాటు ఆర్థిక లావాదేవీలపై సమస్యలు ఉంటే చట్టపరంగా ఆశ్రయించాలి తప్ప.. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తోంది..
ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..