SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bjp నాయకులకు కాంగ్రెస్ నేతల స్ట్రాంగ్ వార్నింగ్.. పెద్దపల్లిలో ఏం జరిగిందంటే?

Peddapalli News: రాహుల్‌ గాంధీపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పెద్దపల్లి కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తీవ్ర విమర్శలపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు BJP నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 14:54 IST | Updated: Nov 18, 2026, 14:55 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Peddapalli Telugu News: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా  బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని.. వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

మీడియాతో మాట్లాడిన ఒక స్థానిక కాంగ్రెస్ నాయకులు.. BJP తీరుపై పలు విమర్శలు చేశారు.. వరుసగా మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై.. ప్రస్తుతం దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతల్లో ఉనప్న రాహుల్ గాంధీ స్థాయి తెలియకుండా.. కనీస అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించడం మానేసి.. ఆరు నెలలకోసారి లేదా సంవత్సరానికోసారి మాత్రమే బయటకు వచ్చి.. కేవలం పార్టీ పేరు చెప్పుకుని తిరిగే నాయకులకు విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన తెలిపారు.

నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ.. బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నేతలు పూర్తిగా అబద్దమన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించకుండా మాట్లాడటం సరికాదన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి, బోధల, జూలపల్లితో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల నిధులతో నూతన రహదారుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాల విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు బీజేపీ నేతలకు సూచించారు.. కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ శాంతియుతంగా.. సంయమనంతో ఉంటారని.. అయితే, దానిని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు. తమ పార్టీ నాయకుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినా.. మరోసారి తమ నేతల దిష్టిబొమ్మలను దహనం చేసినా లేదా ఫ్లెక్సీలను చింపివేసినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే రాజకీయంగా.. ప్రజాస్వామ్యబద్ధంగా తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES