SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో మూడు ముక్కలాట.. ఎవరి గ్రూప్ బలమైనది?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో రోజురోజుకూ గ్రూప్ గేమ్ ఆసక్తికరంగా మారుతోంది. మొదటి వీకెండ్‌లో నాగార్జున త్రిగుణ్‌కు ఇచ్చిన క్లాస్ సరిపోలేదని కొంతమంది ప్రేక్షకులు భావించారు. అయితే తాజాగా జరిగిన నామినేషన్స్‌లో సుధీర్ త్రిగుణ్‌ను ప్రశ్నించిన తీరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిగుణ్ గేమ్‌పై సుధీర్ నేరుగా ప్రశ్నలు వేయడంతో హౌస్‌లో అసలు పరిస్థితి ఏంటనేది స్పష్టంగా కనిపించింది.

Written By Vishnu Priya
Published: Sep 15, 2026, 12:30 PM IST | Updated: Sep 15, 2026, 12:39 PM IST
Join

 Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో రోజురోజుకూ గ్రూప్ గేమ్ ఆసక్తికరంగా మారితేగా ఎంత టైం చేస్తోంది. ముఖ్యంగా నిన్న ఎపిసోడ్లో త్రిగుణ్ గేమ్‌పై సుధీర్ నేరుగా ప్రశ్నలు వేయడంతో హౌస్‌లో అసలు పరిస్థితి ఏంటనేది స్పష్టంగా కనిపించింది. త్రిగుణ్ అభిప్రాయం ప్రకారం రోహిత్ ఒక గ్రూప్‌ను తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాడు. తనకు దగ్గరగా ఉన్న వారిని రోహిత్ కాపాడుతున్నాడని త్రిగుణ్ భావిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని సుధీర్ పూర్తిగా వ్యతిరేకించాడు. రోహిత్ ప్రత్యేకంగా ఎలాంటి గ్రూప్‌ను ఏర్పాటు చేయలేదని చెప్పాడు. నామినేషన్స్ సమయంలో సుధీర్ అడిగిన ప్రశ్నలకు త్రిగుణ్ సమాధానం చెప్పడంలో ఇబ్బంది పడటం కూడా కనిపించింది.

ఇక హౌస్‌ను గమనిస్తే ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నట్లు అనిపిస్తోంది. మొదటి వర్గంలో రోహిత్‌కు దగ్గరగా ఉన్న కంటెస్టెంట్లు కనిపిస్తున్నారు. అగ్నిపరీక్షలో పాల్గొన్న వారిలో ఝాన్సీ మినహా మిగిలినవారు ఈ వర్గానికి దగ్గరగా ఉన్నారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనూ ఎక్కువగా జోక్యం చేసుకోరు. కానీ తమపై ఎవరైనా దాడి చేస్తే మాత్రం కలిసి నిలబడుతున్నారు.

రెండో వర్గంలో దేబ్జానీ, రాంప్రసాద్, నరేష్, ముకేశ్ ఉన్నట్లు కనిపిస్తోంది. వీరు పూర్తిగా ఒకే వ్యక్తి మాట వినకుండా తమ ఆటను తాము ఆడుతున్నారు. అవసరమైనప్పుడు ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారు. ఇతరులు తమపై ప్రభావం చూపాలని ప్రయత్నించినా సులభంగా అంగీకరించడం లేదు.

మూడో వర్గం త్రిగుణ్ చుట్టూ కనిపిస్తోంది. వర్షిణి, ఝాన్సీ, కృష్ణుడు అతనికి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్, షాలినిపై వీరికి వ్యతిరేక భావన ఉన్నట్లు కనిపిస్తోంది. అమన్, స్రిష్టితో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. వంశీకృష్ణ మాత్రం ఇప్పటివరకు న్యూట్రల్‌గా కనిపిస్తున్నాడు.

తాజా నామినేషన్స్‌తో రోహిత్‌పై ఆధిపత్యం సాధించాలనే త్రిగుణ్ ప్రయత్నం స్పష్టంగా కనిపించిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి. ఈ వారం జరిగే గేమ్స్‌లో త్రిగుణ్ మళ్లీ బలంగా ఆడితే హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

Also Read: Nandana Wild Card Entry: బిగ్‌బాస్‌ హోస్‌లోకి నందన వైల్డ్ కార్డు ఎంట్రీ..ఏకంగా రూ.2 లక్షలు ఆఫర్ చేసిన బిగ్‌బాస్ టీమ్!

Also Read: Varanasi Movie: వారణాసి నుంచి మరో బిగ్ లీక్.. గుడి సెట్‌లో డైనోసార్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Add Zee News as a Preferred Source

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES