SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బరువు తగ్గాలా? ఎముకలు ఉక్కులా మారాలా?.. రోజూ రాగులు తింటే కలిగే 5 ఆశ్చర్యకరమైన లాభాలు ఇవే!

రాగుల్లో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. వీటితో రాగి జావ, రోటీ, సూప్‌ తయారు చేసుకుంటారు. అయితే, మన బామ్మల కాలం నాటి నుంచి కూడా రాగితో రోటీలు తింటారు. వీటిని రోజువారీ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు..

Written By Renuka Godugu
Published: Nov 19, 2026, 16:11 IST | Updated: Nov 19, 2026, 16:16 IST
Image Credit: Eating Ragi Daily:
Join

Eating Ragi Daily: రెగ్యులర్‌గా గోధుమ రోటీలు తింటూనే ఉంటాం. అయితే, దీనికంటే కంటే కూడా రాగుల్లో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉంటాయి. మన బామ్మల కాలం నాటి నుంచి కూడా రాగులతో జావ, రాగి ముద్ద తింటూనే వస్తున్నారు. ఎముకలు ఉక్కులా మార్చే గుణం ఈ రాగుల్లో ఉంటుంది.  ప్రధానంగా రాగులను మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వాడతారు. ఈ చిన్న మిల్లెట్స్‌ సహజమైన రంగులో ఉంటాయి. బోలెడన్ని పోషకాలు కూడా ఉంటాయి. సాధారణంగా రాగులతో రొట్టెలు, జావ, ఇడ్లీ, దోశ, ఈ మధ్య కాలంలో స్నాక్స్‌, లడ్డూలు కూడా తయారు చేసుకుంటున్నారు.

రాగుల్లో డైటరీ ఫైబర్‌, మొక్కల ఆధారిత ప్రోటీన్‌ కూడా లభిస్తుంది. ఈ రాగుల్లో కాల్షియం, ఐరన్‌ ఉంటుంది. వీటిని రోజువారీ తీసుకోవడం వల్ల మనకు సమతుల ఆహారం లభిస్తుంది. రాగులు మన డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

కాల్షియం పుష్కలం..
రాగులను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన కాల్షియం కూడా లభిస్తుంది. ఈ ఖనిజం సహజంగా ఎముకలు, పంటికి అవసరం. అదేవిధంగా మన శరీర కండరాల కదలికలకు కూడా ఈ ఖనిజం అవసరమే. ప్రతిరోజూ మనం తీసుకునే ఫుడ్స్‌లో ఈ కాల్షియం ఉండే ఫుడ్స్‌ చేరిస్తే సమతుల ఆహారం అవుతుంది. ఈ మధ్య కాలంలో రాగులతో ఉప్మా, ఇడ్లీ, దోశతోపాటు స్వీట్‌ రిసిపీలు కూడా తయారు చేసుకుంటున్నారు. కాల్షియం కేవలం రాగుల్లో మాత్రమే కాదు.. పాలు, పెరుగు, పనీర్‌లలో కూడా లభిస్తుంది.

డైటరీ ఫైబర్‌..
రాగుల్లో డైటరీ ఫైబర్‌ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కదలికలకు కూడా తోడ్పడుతుంది. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాగి పిండితో రోటీ, ప్యాన్‌కేక్‌, దోశలు వేసుకుని తింటారు. ఈ రాగులను కూరగాయలతో కూడా కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు.

మొక్కల ఆధారిత ప్రోటీన్‌..
రాగుల్లో మొక్కల ఆధారిన ప్రోటీన్‌ ఉంటుంది. శరీర కణజాల నిర్వహణకు, సహజ అభివృద్ధికి కూడా ఈ మొక్కల ఆధారిత ప్రోటీన్‌ అవసరమే. రాగి రొట్టెలు తయారు చేసుకుని శనగలు, కిడ్నీ బీన్స్‌, పెరుగు, పప్పుతో తీసుకుంటే సమతుల ఆహారం అవుతుంది. రాగి జావ పాలతో కూడా తీసుకుంటారు. ఇలా రాగులను వివిధ రకాలుగా మన డైట్‌లో చేర్చుకోవచ్చు.

Read Also: రొటీన్ పనీర్ బటర్ మసాలా తిని బోర్ కొట్టిందా? అయితే ఈ పనీర్ కోఫ్తా ట్రై చేయండి.. టేస్ట్ అద్దిరిపోతుంది!

ఇది ముఖ్యమైన ఖనిజం..
ఇవి మాత్రమే కాదు.. రాగుల్లో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌ ఉంటుంది. ఈ ఐరన్‌ హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికి అవసరం. మెగ్నీషియం కండరాలు, నాడీ పనితీరుకు తోడ్పడుతుంది.  ఇక ఫాస్పరస్‌ ఎముకలకు ఎంతో ముఖ్యం.

బ్రేక్‌ఫాస్ట్‌లో బెస్ట్‌..
రాగిని మనం బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే రోజంతటికీ కావాల్సిన శక్తి మనకు లభిస్తుంది. ఉదయం దోశ, ఇడ్లీ, జావ, ముద్ద రూపంలో తీసుకోవడానికి ప్రయత్నించండి. రాగితో మీరు జావ చేస్తే పాలు, నీరుతో తినవచ్చు. ఇందులో గింజలు, విత్తనాలు, తాజాపండ్లు చేరిస్తే మంచి ఫ్లేవర్‌ కూడా లభిస్తుంది. రాగులతో తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌కు కొబ్బరి చట్నీ, కూరగాయలతో తయారు చేసుకున్న సాంబర్‌ కూడా బెస్ట్‌ ఆప్షన్‌.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES