SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చాలా తక్కువ మందికి తెలిసే బ్లాక్ బీన్స్ 5 ఆరోగ్య ప్రయోజనాలు.. వీటి గురించి వింటే షాకవుతారు!

బ్లాక్‌ బీన్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే ప్రొటీన్‌, ఫైబర్‌ కూడా లభిస్తుంది. కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది కాబట్టి బరువు కూడా నిర్వహణలో ఉంటుంది.

Written By Renuka Godugu
Published: Nov 26, 2026, 17:28 IST | Updated: Nov 26, 2026, 17:31 IST
Image Credit: Black Beans Benefits:
Join

Black Beans Benefits: బ్లాక్‌ బీన్స్‌లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇందులో ఫోలిక్‌ యాసిడ్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, కాల్షియం, ఐరన్‌, మ్యాంగనీస్‌ వంటివి ఉంటాయి. మన డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే ప్రోటీన్‌, ఫైబర్‌ కూడా లభిస్తుంది.  బ్లాక్‌ బీన్స్‌ పోషకాలకు పవర్‌ హౌస్‌. కార్డియో ఆరోగ్యానికి కూడా ఇవి తోడ్పడతాయి. ఇది కొన్ని రకాల కేన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

రెగ్యులర్‌గా బ్లాక్‌ బీన్స్‌ తింటే బోలెడు ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం..

కేన్సర్‌కు వ్యతిరేకం..
బ్లాక్‌ బీన్స్‌లో ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేస్తాయి. ఇందులో హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను సమతులం చేసే సమ్మేళనాలు ఉంటాయి. ఆరోగ్యకరంగా కణాలను కాపాడుతాయి. కొన్ని రకాల కేన్సర్‌ కణాలు అభివృద్ధి కాకుండా కాపాడుతాయి.

కార్డియో ఆరోగ్యం..
బ్లాక్‌ బీన్స్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించే గుణం కలిగి ఉంటుంది. అర్టెరీ బ్లాక్‌ కాకుండా కొవ్వు పెరగకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపరిచే గుణం ఇందులో ఉంది.

గట్‌ హెల్త్‌..
బ్లాక బీన్స్‌ కరగని ఫైబర్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుది. ఇందులో ఫైబర్ టాక్సిన్స్‌ మన శరీరంలో నుంచి బయటకు పంపించి జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఇమ్యూనిటీ బూస్ట్‌..
బ్లాక్‌ బీన్స్‌లో ఫోలెట్‌ కీలకం పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్‌ అవుతుంది.  కొన్ని రకాల సీజనల్‌ జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

బరువు తగ్గుతారు..
బ్లాక్‌ బీన్స్‌ మన డైట్‌లో ఉండే ఆరోగ్యకరమైన బరువుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్‌, ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి కడుపు నిండిన అనుభూతి కూడా ఎక్కువ సమయంపాటు లభిస్తుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. ఇవి కొలెస్ట్రాల్‌ గ్రహించడాన్ని తగ్గిస్తుంది. తద్వారా రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES