World Vegetarian Day: మానవ ఆరోగ్యం మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షణ..జీవాల పట్ల కారుణ్యం వహించాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పడానికి ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
Pesara Kattu Recipe: పెసరపప్పుతో చేసే పెసర కట్టు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా తయారు చేయడం కూడా చాలా సులభం. ఆంధ్ర స్టైల్‌లో అల్లం, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్రతో తాలింపు పెట్టి చేసుకునే ఈ సంప్రదాయ వంటకాన్ని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అదిరిపోతుంది.
మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మొలకెత్తిన విత్తనాలు అంటే కేవలం శనగలు మాత్రమే కాదు, మొలకెత్తిన మెంతులు కూడా చాలా ఆరోగ్యకరం. వీటి ప్రయోజనాలు తెలిస్తే మీరు వీటిని అస్సలు వదిలిపెట్టరు.
యాలుకలను వంటల్లో రుచి, సువాసన కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. జీర్ణక్రియకు సహాయపడటం, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాల కారణంగా ఇవి ఆహారంలో భాగంగా తీసుకుంటారు.
పచ్చి వెల్లుల్లిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీనిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో సహజంగా ఉండే అలసిన్ వంటి ఆక్సిడెంట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఇది సమతుల్య ఆహారంలో భాగంగా ఉండటం మంచిది.
ఒక్కోసారి స్పైసీ ఫుడ్ లేదా అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా అనిపిస్తుంది. ఈ సమయంలో వెంటనే ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తుంటాం. అయితే వాము నీళ్లు లేదా సోంపు నీళ్లు.. ఈ రెండిటిలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది?
Ghee Health Risks: వేడి వేడి రోటీలపై నెయ్యిని అధికంగా వేసుకుని తింటున్నారా? తప్పకుండా వైద్య నిపుణుల సూచిస్తున్న కొన్ని విసయాలు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే ఇలా తింటే లాభాలతో పాటు దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని వారు చెబుతున్నారు. అయితే, ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది హై బీపీ సమస్యతో బాధపడుతుంటారు, అయితే కేవలం ఉప్పు తగ్గించడం వల్ల మాత్రమే ఇది తగ్గుతుందని అనుకుంటారు. కానీ, కేవలం ఉప్పు తగ్గించినంత మాత్రాన హై బీపీ సమస్య పూర్తిగా తగ్గదు. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యుల సూచన మేరకు మందులు వాడటం తప్పనిసరి. అదే సమయంలో వైద్యులు సూచించిన కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను అదుపు చేయవచ్చు.
పండ్లలో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచివి. అంతేకాకుండా, డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా వీటిని సహజంగా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ కూడా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రీ-డయాబెటిస్ లేదా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వీరు సరైన డైట్ పాటించాలి.
ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి సూపర్ ఫుడ్స్ కొనుగోలు చేస్తేనే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే అని లైఫ్ స్టైల్ కోచ్ పేర్కొంటున్నారు. కేవలం ఎక్కువ ధర ఉన్న పదార్థాలనే కాకుండా, మనకు సులభంగా అందుబాటులో ఉండే కొన్ని పండ్లలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయని, వాటిని సులభంగా మన డైట్‌లో చేర్చుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు.
High Magnesium Foods: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒక్క సర్వింగ్‌లకు 165 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. వీటితోపాటు కొన్ని రకాల ఆకుకూరలు, గింజలు, పప్పుదినుస్సుల్లో కూడా సరైన మెగ్నీషియం లభిస్తుంది. వీటిని డైట్లో చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం లభిస్తుంది.
ఆరోగ్యకరమైన గట్ అనేది జీర్ణవ్యవస్థలో ఉన్న ట్రిలియన్ బ్యాక్టిరియాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మైక్రోబ్‌స్ కొన్ని రకాల ఫైబర్, మొక్కల సమ్మేళనాలను తీసుకుంటాయి. దీంతో మన గట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మీ జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. ఏయిమ్స్ వైద్యుల ప్రకారం మన డైట్‌లో ఎలాంటి ఫుడ్స్ ఉండాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Liver Detox Telugu Tips: కాలేయాన్ని డీటాక్స్ చేసుకోవడానికి చాలా మంది వివిధ రకాల మందులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడేవారు రోజు ఈ కింది డ్రింక్స్ తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. లివర్ ఆరోగ్యవంతంగా తయారవుతుంది.
కాలేయం అనేది మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది మన శరీరంలో ఎన్నో విధులను నిర్వర్తిస్తుంది. ప్రధానంగా ఆహారం జీర్ణం అవ్వడానికి ఇది పనిచేస్తుంది. కాలేయం ఫుడ్ విటమిన్, ఖనిజాలు నిల్వ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఫ్యాటీ లివర్ రివర్స్ చేసే 21 రోజుల డైట్.. దీంతో వైద్యులు ఏం సూచిస్తున్నారు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో బ్లాక్ టీ వినియోగం, దాని ప్రాచుర్యం గణనీయంగా పెరిగింది. బ్లాక్ టీ తాగడం వల్ల మనకు అద్భుతమైన ఫ్లేవర్స్, ఆహ్లాదకరమైన అరోమా లభిస్తాయి. ఇది మన శరీరాన్ని వివిధ రకాల హానికర అంశాల బారిన పడకుండా కాపాడుతుంది. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి; ఇందులో గత ఆరోగ్యంతో పాటు శరీరానికి అవసరమైన అనేక ఇతర ఆరోగ్య గుణాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి.