దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!
దీపావళి పండుగ రానుంది. ఇది దీపాల పండుగ సాధారణంగా ఇంటి లోపల మాత్రమే కాదు ఆరుబయట కూడా దీపాలను వెలిగిస్తాం. ప్రధానంగా ఈ పండుగకు మట్టి ప్రమిదలను వాడతాం. ఇంట్లో గత ఏడాది వాడిన మట్టి ప్రమిదలు కూడా ఉంటాయి. వాటిని మళ్లి ఈ పండక్కి ఉపయోగించవచ్చా? వీటిని కొత్త వాటిలా ఎలా మెరిపించాలి తెలుసుకుందాం.
Can You Reuse Old Clay Diyas: దీపావళి అంటేనే అజ్ఞానాన్ని తొలగించి వెలుగులు నింపే పండుగ. అందుకే ప్రత్యేకంగా ఈ పండక్కి దీపాలను ఇంట్లో, ఆరుబయట, ఇంటిని కూడా దీపాలు, లైట్స్‌తో అలంకరించుకుంటాం. అయితే, సాధారణంగా దీపావళికి ఎక్కువగా మట్టి ప్రమిదలను ఉపయోగిస్తాం. అయితే, పాత మట్టి ప్రమిదలను ఉపయోగిస్తున్నారా? వాటిని కొత్తవాటిలా ఎలా మెరిపించాలి తెలుసుకుందాం. అయితే, మన పూర్వీకుల కాలం నుంచి కూడా గత ఏడాదికి వాడిన మట్టి ప్రమిదలను ఈ ఏడాది వాడే ఆచారం ఉంది. అయితే, పాతవి వాడొచ్చు కానీ, విరిగినవి వాడకూడదు.
మట్టి ప్రమిదలు..
దీపావళి అంటేనే గుర్తుకు వచ్చేది మట్టి ప్రమిదలు.. ఇది భూతత్వం కలిగి ఉంటుంది. అయితే, గత ఏడాది వాడిన ప్రమిదలు పూర్తిగా జిగటగా, ధుమ్ము పేరుకుంటాయి..అయితే, వేద శాస్త్రాల ప్రకారం కొత్త దీపాలను ఈ పండక్కి కొనుగోలు చేస్తే కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. అయితే, పూజలో వాడితే ముందుగా వాటిని నానబెట్టి, శుభ్రంగా కడిగి, ఆరబెట్టి వాడుకోవచ్చు.
వెండి, కంచు దీపాలు..
మెటల్‌తో తయారు చేసిన ప్రమిదలను ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చు. వెండి, ఇత్తడి దీపాలు కూడా ఎన్నో ఏళ్లు వాడొచ్చు.
సాధారణంగా ఈ మట్టి ప్రమిదలను దీపావళి ఇతర పండుగ సమయంలో వాడొచ్చు. ముందుగా నానబెట్టి కడగాలి. ఆరబెట్టిన తర్వాత గంగాజలం చల్లుకోవాలి.
ఇక కంచు దీపాలను కూడా మనం డైలీ పూజగదిలో వెలిగిస్తూనే ఉంటాం. వీటిని ఇంట్లో పితాంబరి ఉపయోగించి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇక వెండి దీపాలను ప్రత్యేక పూజలు చేసినప్పుడు వాడతాం. వీటిని కూడా కాసేపు వేడి నీటిలో నానబెట్టి, గంగాజలంతో శుభ్రం చేసుకోవచ్చు. అయితే, పిండితో తయారు చేసుకునే దీపాలను మాత్రం కార్వాచౌత్, లక్ష్మీగణేశ పూజలో వాడతారు. వీటిని ఆవు, పక్షులు లేదా పారే నీటిలో వదిలేస్తారు.
పాత ప్రమిదలను శుభ్రం చేసుకునే విధానం..
ముందుగా ఆ ప్రమిదలకు ఉన్న జిడ్డును వదిలించాలి. మట్టి ప్రమిదలను ఒక బక్కెట్ నీటిని తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి అరగంటపాటు ఈ ప్రమిదలను నానబెట్టాలి.ఇది వాటికి అంటుకున్న జిడ్డిను తొలగిస్తుంది.
ఇక మెటల్ దీపాలకు మాత్రం వేడి నీళ్లలో ముందుగా నానబెట్టాలి. అందులో నిమ్మరసం యాడ్ చేయండి. పితాంబరితో శుభ్రం చేసుకోవచ్చు. స్పాంజ్ సహాయంతో ఈ మెటల్ దీపాలను శుభ్రం చేసుకోవచ్చు.
అయితే, ముందుగా ఏ ప్రమిదలు అయినా కానీ, శుభ్రంగా తుడవాలి. మాయిశ్చర్ లేకుండా చూడండి. తడి వత్తిలను కూడా ఉపయోగించకూడదు. లేకపోతే దీపం సరిగ్గా వెలగదు.. అందుకే పండుగల సమయంలో ఎండలో ఓ మూడు గంటలపాటు ఆరబెట్టండి. ఇక శుభ్రం చేసిన వెంటనే దాన్ని ఆరబెట్టండి, ఆ తర్వాత గంగా జలం నీటిని సాధారణ నీటిలో కలిపి లేదా పసుపు కూడా వేసిన నీటిని కడగాలి. దీపం వెలిగించే ముందు కింద అడుగు భాగంలో కాస్త బియ్యం వేసి ప్రమిదకు కుంకుమ బొట్టు కూడా పెట్టాలి.
అయితే, పగిలిన ప్రమిదను పొరపాటున కూడా ఉపయోగించకూడదు. అదే విధంగా మట్టి ప్రమిదలు కూడా పూర్తిగా కాలిపోయినవి కూడా వాడకపోవడమే మంచిది. అయితే, ఇలా పాడైపోయిన మట్టి ప్రమిదను వాడకుంటే ఇంటి మొక్కలకు కంపోస్టుగా వాడొచ్చు. వాటిని క్రష్ చేసి వాడొచ్చు. పాత మట్టి ప్రమిదలను శుభ్రంగా కడిగి అక్రిలిక్ పెయింట్ ఉపయోగించి అలంకరించండి. ఇందులో పసుపు, కుంకుమ వేసి పెట్టుకోవచ్చు.
సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో దీపాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపం అంటేనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపడం. ఇది ఇంట్లో నెగిటివిటీని కూడా దూరం చేస్తుంది. ఇంట్లో సుకఃసంతోషాలను ప్రసాదిస్తుంది. దీపావళికి ప్రత్యేకంగా దీపాలను అందుకే వెలిగిస్తారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)