• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల దర్శనం! తెలుగురాష్ట్రాల మీదుగా ప్రయాణం!

అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల దర్శనం! తెలుగురాష్ట్రాల మీదుగా ప్రయాణం!

IRCTC అద్భుతమైన ప్యాకేజీని తీసుకువచ్చింది. 'దివ్యదక్షిణ యాత్ర' పేరుతో అరుణాచలం యాత్ర సికింద్రాబాద్ నుండి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అరుణాచలం, చిదంబరం మాత్రమే కాకుండా కన్యాకుమారి, రామేశ్వరం వంటి క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ దివ్య దర్శన భాగ్యం పొందాలనుకునే వారు టూర్ ప్యాకేజీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Written ByRenuka Godugu
Published: Oct 17, 2026, 10:38 AM IST|Updated: Oct 17, 2026, 10:45 AM IST
joinshare
అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల దర్శనం!  తెలుగురాష్ట్రాల మీదుగా ప్రయాణం!
Image Credit: IRCTC Arunachalam Tour Package:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

2

దాండియా ఆడుతూ లిప్ కిస్.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో!

3

ఆహారం నుంచి పొదుపు వరకు.. ఇంట్లో సుఖసంతోషాలు పెంచే చాణక్యుడి జీవిత సూత్రాలు!

4

అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల దర్శనం! తెలుగురాష్ట్రాల మీదుగా ప్రయాణం!

5

చేతికి డబ్బు రాగానే ఈ 4 తప్పులు చేయకండి.. చాణక్య నీతి చెబుతున్న కీలక పాఠాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IRCTC Arunachalam Tour Package: IRCTC వివిధ ఆఫర్లతో టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ, రైలు, బస్సు, విమాన సేవల ద్వారా ట్రిప్స్‌ ప్రకటిస్తోంది. దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా టూర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా IRCTC 'దివ్య దక్షిణ యాత్ర' పేరుతో సికింద్రాబాద్ నుండి అరుణాచలం యాత్రను ప్రారంభించింది. నవంబర్ 23న ప్రారంభమయ్యే ఈ యాత్ర 8 రాత్రులు, 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో అరుణాచలం, చిదంబరం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి వంటి దివ్య క్షేత్రాలను సందర్శించవచ్చు. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్న ఈ ప్యాకేజీలో స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ సౌకర్యాలు ఉన్నాయి. ఈ యాత్రలో బోర్డింగ్ కోసం సికింద్రాబాద్‌తో పాటు చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో కూడా అవకాశం ఉంది.

టూర్ ప్యాకేజీ ధరలు..
ఈ ప్యాకేజీ ధరలు స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.15,800, 5 నుండి 11 ఏళ్ల పిల్లలకు రూ.14,800 గా ఉన్నాయి. థర్డ్ ఏసీలో పెద్దలకు రూ.23,200, పిల్లలకు రూ.22,000. సెకండ్ ఏసీలో పెద్దలకు రూ.29,600, పిల్లలకు రూ.28,100 గా నిర్ణయించారు. సింగిల్  బుక్ చేసుకున్న వారు ఇతర ప్రయాణికులతో కలిసి రూమ్‌ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైలు టూరిజం ప్రోత్సహించడానికి 'భారత్ గౌరవ ట్రైన్'లో ప్రయాణిస్తే భారతీయ రైల్వే 33 శాతం రాయితీ కూడా అందిస్తోంది.

రైలు మార్గం..
ఈ రైలు నవంబర్ 23, 2026న సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే 24వ తేదీ ఉదయం 8 గంటలకు తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాణికులు తిరుమన్నమలై చేరుకుంటారు. అక్కడ ఒక రాత్రి బస చేసిన తర్వాత, 24వ తేదీన అరుణాచల దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుమన్నమలై నుండి రైలు ద్వారా చిదంబరం చేరుకుంటారు. చిదంబరం స్టేషన్‌లో నటరాజ దేవాలయం దర్శనానికి వెళ్తారు  అక్కడి నుండి తిరుచిరాపల్లికి , స్టేషన్ వద్ద వసతి కల్పించి నైట్ స్టే ఏర్పాటు చేస్తారు. 26వ తేదీ రాత్రి 10:50 గంటలకు తంజావూరు చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రంగనాథ స్వామి ఆలయం, 60 కి.మీ దూరంలో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు.

అనంతరం తంజావూరు నుండి రామేశ్వరానికి బయలుదేరుతారు. 27వ తేదీ ఉదయం 3:15 గంటలకు రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ స్టేషన్ వద్ద వసతి కల్పించి, టెంపుల్ దర్శనంతో పాటు స్థానిక దేవాలయాలను సందర్శిస్తారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు చెక్ అవుట్ చేసి, మళ్లీ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. 29వ తేదీ ఉదయం 4:50 గంటలకు కన్యాకుమారి చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అయి, ఫ్రెష్ అయిన తర్వాత రాక్ మెమోరియల్, గాంధీ మెమోరియల్, సన్ సెట్ పాయింట్లను సందర్శిస్తారు. ఆ తర్వాత నాగర్‌కోయిల్ స్టేషన్ నుండి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

30వ తేదీ నుండి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, చర్లపల్లి స్టేషన్ల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.

ఇవి గమనించండి..
యాత్రలో ఉదయం టీతో పాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు (కేవలం వెజిటేరియన్ మాత్రమే). ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో భద్రత కూడా ఉంటుంది. IRCTC మేనేజర్లు కూడా యాత్రలో మీతో కలిసి ప్రయాణిస్తారు. అయితే, ఏదైనా స్మారక కట్టడాల రుసుము, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, మీకు నచ్చిన ఇతర ఆహార పదార్థాలు, రూమ్ సర్వీస్, సైట్ సీయింగ్‌ కోసం మీరు విడిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లోకల్ గైడ్ల ఫీజు, డ్రైవర్లు, వెయిటర్లు, గైడ్లకు ఇచ్చే టిప్స్ కూడా మీరే భరించాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Indian Railways
Travel