SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చెట్టినాడు స్టైల్ చికెన్ బిర్యానీ ట్రై చేయండి.. టేస్ట్‌కు ఫిదా అవ్వాల్సిందే!

ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగనివారుంటారు. చికెన్‌ లేదా మటన్‌తో వివిధ రిసిపీలు తయారు చేసుకుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి చెట్టినాడ్‌ స్టైల్‌లో చికెన్‌ బిర్యానీ ట్రై చేయండి. ఆ రుచికి మీరు కూడా ఫిదా అవ్వడం పక్కా..

Written By Renuka Godugu
Published: Nov 21, 2026, 14:46 IST | Updated: Nov 21, 2026, 14:51 IST
Image Credit: Chettinad Chicken Biryani Recipe:
Join

Chettinad Chicken Biryani Recipe: బిర్యానీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. హైదరాబాద్‌ అంటే బిర్యానీకి ఫేమస్‌ అయితే, ఎప్పుడూ ఒకే విధమైన బిర్యానీ ట్రై చేయకండి. వాటిలో చిన్నపాటి మార్పులు చేస్తే అద్భుతమైన రుచి కూడా పొందుతారు. రుచికరమైన చెట్టినాడు స్టైల్‌ చికెన్‌ బిర్యానీ రిసిపీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు..
అరకిలో - చికెన్‌
అరకిలో - బాస్మతి రైస్‌
ఉల్లిపాయలు-2
టమోటాలు-2
పచ్చిమిర్చి-2
అల్లంవెల్లుల్లి పేస్ట్‌
పెరుగు -1/4
నెయ్యి-2 టీస్పూన్స్‌
పసుపు- టీస్పూన్‌
కారం -టీస్పూన్‌
లవంగాలు-3
యాలకులు-2
నూనె-2 టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
పుదీనా, కొత్తిమీర
దాల్చిన చెక్క,

Read Also: రొటీన్ పనీర్ బటర్ మసాలా తిని బోర్ కొట్టిందా? అయితే ఈ పనీర్ కోఫ్తా ట్రై చేయండి.. టేస్ట్ అద్దిరిపోతుంది!
 

తయారీ విధానం..
ముందుగా చికెన్‌ శుభ్రంగా కడగాలి. బాస్మతి బియ్యాన్ని కూడా ఓ అరగంటపాటు నానబెట్టుకోవాలి. 
ముందుగా మనం చికెన్‌ కూడా మ్యారినేట్‌ చేయాలి. అల్లంవెల్లుల్లి, పెరుగు, పసుపు, కారం, ఉప్పు మీ మ్యారినేషన్‌కు తగినట్లుగా వేయాలి. బాగా కలిపి ఓ గంటపాటు మ్యారినేట్‌ చేయాలి.

ఇప్పుడు మందపాటి ప్యాన్‌ తీసుకుని అందులో యాలకులు, లవంగం, దాల్చిని వేసి దోరగా వేయించింది.  ఇప్పుడు ఉల్లిపాయ కూడా సన్న చిలికలుగా కట్‌ చేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేయండి. ఇందులోనే మ్యారినేట్‌ చేసిన చికెన్‌ కూడా వేసి వేయించాలి.  కొన్ని నిమిషాలు మగ్గిన తర్వాత కట్‌ చేసిన టమోటాలు, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పెరుగు, పుదీనా, కొత్తిమీర కడూఆ వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించండి.

ఇప్పుడు చికెన్‌పైన నానబెట్టిన రైస్‌, ఫ్రైడ్‌ ఆనియన్స్‌, జీడిపప్పు, కిస్మిస్‌ కూడా వేసి మూత గట్టిగా దమ్‌ పెట్టి ఓ 20 నిమిషాలు ఉడికించండి. మంట లో ఫ్లేమ్‌లో ఉండాలి. తాజా కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డిస్తే రుచి బాగుంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES