రొటీన్ పనీర్ బటర్ మసాలా తిని బోర్ కొట్టిందా? అయితే ఈ పనీర్ కోఫ్తా ట్రై చేయండి.. టేస్ట్ అద్దిరిపోతుంది!
Paneer Kofta Recipe: సాధారణంగా పనీర్ రిసిపీలు అంటే చాలామందికి ఇష్టం. ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే, నార్త్ ఇండియా వైపు ఎక్కువగా ఈ పనీర్ రిసిపీలు చేస్తూ ఉంటారు. అయితే, మీరు కూడా ఎప్పుడూ పనీర్ బట్టర్ మసాలా లేదా ఇతర రొటీన్ రిసిపీలతో విసుగెత్తిపోయారా? అయితే, ఈ సారి టేస్టీగా ఉండే ఈ పనీర్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోండి. ఇందులో ఇండియన్ మసాలాతోపాటు పెరుగు, బాదం, తాజా క్రీముతో తయారు చేసుకోవచ్చు. మీ ఇంటికి ఫ్రెండ్స్ లేదా బంధువులు వచ్చినప్పుడు ఈ రిసిపీ వండి పెట్టండి. ఎంతో బాగుందని మెచ్చుకోకుండా ఉండరు. వేయించిన కాటేజ్ చీజ్ బాల్స్‌తో తయారు చేస్తారు. సాధారణంగా అందరి ఇళ్లలో ఎక్కువగా పనీర్ బట్టర్ మసాలా, షాహీ పనీర్, పనీర్ టిక్కా మసాలా తయారు చేసుకునే ఉంటారు. ఇవి నాన్, తందూరి రోట, రుమాలీ రోటీల్లోకి బాగుంటాయి. మీరు పాట్ లాక్ లేదా కిట్టీ పార్టీలకు వెళ్లినా ఈ పనీర్ కోఫ్తా మసాలా తయారు చేసుకని వెళ్లండి.

కావాల్సిన పదార్థాలు..
పనీర్ 250 గ్రాములు
బాదం 1/2 కప్పులు
పసుపు
కారం -అర టీస్పూన్
ధనియాల పొడి
నూనె -100 ml
పచ్చిమిర్చి- రెండు
ఉప్పు- రుచికిసరిపడా
తాజా క్రీమ్ టీస్పూన్
పెరుగు -100 గ్రాములు
టమాటా ప్యూరీ- పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టీ స్పన్
నల్ల యలాకు-1
ఉల్లిపాయ-1
కార్న్‌ఫ్లోర్- అరటీస్పూన్
కొత్తిమీర
పనీర్ కోఫ్తా కర్రీ తయారీ విధానం..
ముందుగా పనీర్ కడగి బాగా గ్రేట్ చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నూనె వేడి చేయండి. ఇందులో పనీర్, కారం, బాల్స్‌కు సరిపడా ఉప్పు, కార్న్‌ఫ్లోర్, క్రష్ చేసిన బాదం ముక్కలు వేసి బాల్స్‌లా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు డీప్‌ఫ్రై కోసం మరో కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయండి. ఈ రిసిపీ తయారు చేసేటప్పుడు మీడియం మంటపై ఉండేలా చూసుకోండి. పనీర్ బాల్స్ ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకోండి. బాల్స్ అన్నీ ఇలాగే వేయించాలి. ఆ తర్వాత కడాయిలో ఉన్న నూనె తీసేసి కేవలం ఒక స్పూన్ నూనె మాత్రం అలాగే ఉండనివ్వండి. ఇందులో ఎండు మిర్చి, నల్ల యాలకు వేయాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించండి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లు కూడా పోసి సిమ్‌లో కొద్ది సేపటి వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోనే గిలకొట్టిన పెరుగు, టమాటా ప్యూరీ వేసి బాగా ఉడికించండి. ఇప్పుడు గ్రేవీ దగ్గరకు పడుతున్న సమయంలో ఫ్రై చేసిన పనీర్ కోఫ్తా వేయండి. ఇప్పుడు తాజా క్రీమ్, కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. అంతే, రుచికరమైన పనీర్ కోఫ్తా కర్రీ రెడీ అయినట్లే. దీన్ని బట్టర్ నాన్ లేదా రుమాలీ రోటీతో తింటే అదిరిపోతుంది.