SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డిప్రెషన్‌లో ఉన్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Depression Causes: డిప్రెషన్ అనేది ఇప్పుడు చాలా మందిలో వస్తున్న సమస్య.. ముఖ్యంగా నేటి యువత ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అయితే, దీని లక్షణాలు తెలియక చివరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిప్రెషన్ లక్షణాలు, దీని నుంచి ఎలా ఉపశమనం పొందాలో మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌ మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 12:01 IST | Updated: Nov 19, 2026, 12:14 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Depression In Teenagers: ప్రస్తుతం అనుసరిస్తున్న ఆధునిక జీవనశైలితో పాటు ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి.. వీటిలో చాలా మంది ఎదుర్కొంటున్నది డిప్రెషన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో సుమారు 32.2 కోట్ల మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారట.. అంతేకాకుండా పెద్దవారిలో ఈ శాతం 5.2గా ఉండగా.. 70 ఏళ్లు పైబడిన వృద్ధులలో 5.4 శాతంగా ఉన్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి.

మగవారితో పోలిస్తే.. స్త్రీలలో డిప్రెషన్ బారిన పడే ఛాన్స్‌లు 1.5 రెట్లు అధికంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తూ ఉన్నాయి. పురుషులలో 4.1 శాతం మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. మహిళలలో ఇది 6.2 శాతం మాత్రమే ఉందని తెలుస్తోంది.. ముఖ్యంగా గర్భిణులతో పాటు ప్రసవం తర్వాత బాలింతలలో 10 శాతానికి పైగా మంది తీవ్ర డిప్రెషన్‌కు లోనవుతున్నారని ప్రస్తుత నివేదికలు చెబుతున్నాయి.

లక్షణాలను ఇలా గుర్తించండి..
ప్రతి రోజు జీవితంలో వచ్చే చిన్నపాటి మూడ్ మార్పులకు.. డిప్రెషన్‌కు చాలా తేడా ఉంటాయట.. కనీసం రెండు వారాల పాటు రోజంతా విపరీతమైన విచారంతో పాటు ఎలాంటి పనులు చేయాలనిపించకుండా ఉండడం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం దీని ప్రధాన లక్షణాలు.. వీటితో పాటు ఏకాగ్రత లోపించడంతో పాటు నిద్రలేమి సమస్యలు, ఆకలితో పాటు బరువులో మార్పులు, విపరీతమైన అలసట, నిస్సహాయత వంటివి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయని మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 29 ఏళ్ల యువత మరణాలకు ఆత్మహత్య మూడో ప్రధాన కారణంగా మారడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఇలా చికిత్స పొందండి..
ఉద్యోగం కోల్పోవడంతో పాటు దగ్గరి వారు దూరం అవ్వడం, చిన్ననాటి చేదు అనుభవాలు వంటి సామాజిక, మానసిక కారణాలే డిప్రెషన్‌కు దారితీస్తాయని మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్ తెలుపుతున్నారు. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే, సామాజిక అపోహలతో పాటు నిపుణుల కొరత వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కేవలం పదిలో మూడో వంతు మందికి మాత్రమే సరైన చికిత్స అందుతోందని మెంటల్‌ హెల్త్ కోచ్‌ వెల్లడించారు..

ఈ డిప్రెషన్‌ సమస్యను పూర్తిగా ఎంతో సులభంగా నయం చేయవచ్చని మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్ తెలిపారు. తేలికపాటి సమస్యకు మందుల అవసరం లేకుండా.. కేవలం కౌన్సెలింగ్ సరిపోతుందని ఆయన అన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుల పర్యవేక్షణలో యాంటీ డిప్రెసెంట్ మందులు వినియోగించడం మంచిదని సూచించారు. వీటితో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు సమయానికి నిద్రపోవడం, మద్యానికి దూరంగా ఉండటం, నచ్చిన పనులు చేయడం, సమస్యలను నమ్మకమైన వారితో షేర్‌ చేసుకోవడం వల్ల దీనిని ఎంతో సులభంగా జయించవచ్చని మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్ వెల్లడించారు.

సేకరణ: మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌
ఈ మెయిల్‌ ఐడీ: Pradeeptalks90@gmail.com

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES