SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నిద్రపోయే ముందు నెగిటివ్ న్యూస్ చూస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Doomscrolling: డూమ్ స్క్రోలింగ్ అంటే ఎంతమందికి తెలుసు? దీని వల్ల చాలా మంది ఎన్నో రకాల మానసిక సమస్యల బారిన పడుతున్నారని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. ముఖ్యంగా చాలా మంది నెగిటివ్‌ న్యూస్‌ చదవడం వల్ల ఆందోళనతో పాటు ఎన్నో రకాల మానసిక సమస్యల బారిన పడుతున్నారు..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 16:39 IST | Updated: Nov 26, 2026, 16:41 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Doomscrolling: ఉదయం నిద్రలేచినప్పటి నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుతం మన ఆలోచనలను శాసించే స్థాయికి చేరిందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే.. ముఖ్యంగా సోషల్ మీడియా, న్యూస్ యాప్స్‌లో వచ్చే క్రైమ్, యుద్ధాలు, ఆర్థిక సమస్యలు, బాధ, భయం వంటి నెగటివ్ వార్తలను ఆపకుండా గంటల తరబడి చూడటాన్ని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ డూమ్ స్క్రోలింగ్ అని పిలుస్తున్నారట.. బాధాకరమైన విషయాలని తెలిసినా.. అక్కడి నుంచి చూపు తిప్పుకోలేక మరింత వాటిని చదవడం, చూడటం ప్రస్తుతం యువతలో, ఉద్యోగుల్లో ఒక వ్యసనంగా మారుతూ వచ్చింది..

మానవ మెదడు సహజంగానే ప్రమాదాలను ముందుగా పసిగట్టేలా తయారవుతుంది.. మనం నెగటివ్ వార్తలను చదివినప్పుడు.. మనకు ఏదో ప్రమాదం జరగబోతోందని మెదడు భావిస్తుందట.. ఫలితంగా శరీరంలో  కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు అధికంగా విడుదల చేస్తుందని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. ఇది నిరంతర భయానికి, అభద్రతా భావానికి దారితీసే ఛాన్స్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉందనే భ్రమలో కూరుకుపోయి.. మనుషులపై నమ్మకం కోల్పోయే ప్రమాదం అధికంగా ఉందట..

డూమ్ స్క్రోలింగ్ కేవలం మానసిక సమస్యలకే పరిమితం కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. చాలా మందిలో రాత్రి పడుకునే ముందు నెగటివ్ కంటెంట్ చూడటం వల్ల మెదడు చురుకుగా మారి, నిద్ర పట్టదు.. ఎప్పుడూ ఏదో జరుగుతుందనే ఆందోళన వల్ల చేసే పనిపై దృష్టి పెట్టలేరని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ పెర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఈ అలవాటు కొనసాగితే తీవ్రమైన కుంగుబాటు, ఆందోళన బారిన పడే అవకాశం ఉందని ఆయన తెలుపుతున్నారు.

ఈ ఉచ్చు నుంచి బయటపడటం ఎలా?
సమాచారం తెలుసుకోవడం మంచిదే కానీ.. అదే జీవితం కాకూడదని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ వెల్లడించారు. ఈ అలవాటును మార్చుకోవడానికి రోజులో వార్తలు చూడటానికి 20 నిమిషాలు సమయాన్ని మాత్రమే కేటాయించాలని వారు చెబుతున్నారు. నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా నమ్మకమైన వార్తా సంస్థలను మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు.. భయాన్ని కలిగించే సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేయడం కూడా మంచిద.. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనసును ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సాంకేతికత మనకు సేవ చేసే విధంగా ఉండాలి తప్ప.. మన ప్రశాంతతను దోచుకునేదానిలా మారకూడదని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ సూచిస్తున్నారు.
 

సేకరణ: మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌

అనుభవం: 6 సంవత్సరాలు
ఈ మెయిల్‌ ఐడీ: Pradeeptalks90@gmail.com

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES