SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బిజీగా ఉండే మహిళల కోసం 5 సులభమైన గ్లాస్ స్కిన్ టిప్స్.. ఇంట్లోనే మెరిసే చర్మం!

Glass skin: బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే మీ ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా అద్దంలా మెరిసే గ్లాస్ స్కిన్ పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Sep 26, 2026, 03:53 PM IST | Updated: Sep 26, 2026, 03:55 PM IST
Image Credit: Glass skin
Join

Glass skin: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇల్లు, ఆఫీస్, కుటుంబ బాధ్యతలతో చాలా మంది మహిళలు సతమవుతున్నారు. ఈ తరుణంలో గంటల తరబడి బ్యూటీ పార్లర్ కు వెళ్లి స్కిన్ కేర్ చేసుకోవడం కుదరని పనే అని చెప్పాలి. కానీ ఎలాంటి బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే మీ ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా అద్దంలా మెరిసే గ్లాస్ స్కిన్ పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.

కొరియన్ బ్యూటీ ట్రెండ్ అయిన గ్లాస్ స్కిన్ కోసం రకరకాల ప్రాసెస్ లు పాటించాల్సిన అవసరం లేదు. బిజీ బిజీగా ఉండే మహిళలు ప్రతిరోజూ కేవలం ఐదు నిమిషాల్లోనే పాటించే 5 బెస్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం.

1. డబుల్ క్లెన్సింగ్: గ్లాస్ స్కిన్ జర్నీలో మొదటి అత్యంత ముఖ్యమైన అడుగు డబుల్ క్లెన్సింగ్. ముందుగా ఆయిల్ బేస్డ్ ఆధారిత క్లెన్సర్ తో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మేకప్, సన్ స్క్రీన్ , ముఖంపై పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతోంది. ఆ తర్వాత మైల్డ్ ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మ రంధ్రాల్లోని దుమ్ము, ధూళి తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. 
 

2. జెంటిల్ ఎక్స్‌ఫోలియేషన్: ఇది చర్మంపై ఉండే డెడ్ సెల్స్ ను తొలగించి ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు స్క్రబ్  చేయాలి. ఇది చర్మాన్ని డ్యామేజ్ చేయకుండా డెడ్ సెల్స్ ను తొలగించి స్కిన్ టెక్స్చర్ ను స్మూత్ చేస్తుంది. 
 

3. హైడ్రేటింగ్ టోనర్ : మీ ముఖ చర్మం మెరిసిపోవాలంటే హైడ్రేషన్ ఉండటం చాలా ముఖ్యం. చర్మం పీహెచ్ బ్యాలెన్స్ ను కాపాడి..ఉత్పత్తులు చర్మంలోకి బాగా ఇంకేలా చేస్తుంది. 
 

4. బ్రైటెనింగ్ సీరమ్: ఇది చర్మానికి లోతైన పోషణను అందించేందుకు సీరమ్ కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ప్లంప్‌గా ఉంచేందుకు హైలురోనిక్ యాసిడ్, మచ్చలు తగ్గించేందుకు నియాసినమైడ్ లేదా గ్లో ఇచ్చే విటమిన్-సి సీరమ్‌ల నుంచి 2-3 చుక్కలు అప్లై చేసి ప్రెస్ చేయాలి.

5. మాయిశ్చరైజర్ ,సన్‌స్క్రీన్: చివరిగా ముఖంలో తేమ ఆవిరైపోకుండా సీల్ చేయడం చాలా ముఖ్యం. మీ చర్మ తత్వానికి తగ్గట్టు తేలికపాటి  మాయిశ్చరైజర్ రాయాలి. పగటిపూట ఖచ్చితంగా SPF 30+ లేదా SPF 50 సన్‌స్క్రీన్ వాడాలి. ఇది సూర్యరశ్మి, పిగ్మంటేషన్ నుంచి చర్మాన్ని కాపాడి నిత్యం గ్లాస్‌లా మెరిసేలా చేస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES