వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!
Barley Kheer: ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
Barley Kheer: ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ బిజీ లైఫ్‌స్టైల్, ఆఫీస్ టెన్షన్స్, ఇంటి పనుల వల్ల చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలసటను ఎదుర్కొంటున్నారు. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంతో సతమతమయ్యే మహిళల ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను చేకూర్చి, శరీరాన్ని రిలాక్స్ చేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బార్లీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
పాతకాలంలో నీరసంగా ఉన్నప్పుడు బార్లీ గిన్నెడు తినేవాళ్లు. ఇది మానసిక ఒత్తిడితోపాటు ఆందోళన తగ్గించడంలోనూ ఎంతో సహాయపడుతుంది.
బార్లీ పాయసం ఎలా తయారు చేస్తారు.. కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం.
-1 కప్పు బార్లీ
-నీరు 2 కప్పులు
-బెల్లం పొడి 1 కప్పు
-అర లీటర్ కొబ్బరి పాలు
-అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి
-6 నుండి 8 పచ్చి యాలకులు
-రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి
-ఎండుద్రాక్షలు గుప్పెడు
-జీడిపప్పు
-నట్స్ కూడా వేస్తే పాయసానికి మంచి రుచి వస్తుంది.
తయారీ విధానం:
బార్లీ సిద్ధం చేయడం:
ముందుగా బార్లీని తీసుకుని శుభ్రంగా కడిగి నీటిని వడకట్టాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో 2 కప్పుల నీరు పోసి, బార్లీ బాగా మెత్తగా ఉడికే వరకు 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆపై కుక్కర్‌లో ప్రెషర్ పూర్తిగా పోయే వరకు అలాగే ఉంచాలి.
బెల్లం కలపడం:
ఇప్పుడు ఉడికించిన బార్లీలో తగినంత బెల్లం పొడి వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు మీడియం మంటపై కలుపుతూ, ఆ తర్వాత సన్నని మంటపై మరో 2 నిమిషాలు ఉడికించాలి.
కొబ్బరి పాలు, యాలకుల పొడి:
ఆ తర్వాత మంట తగ్గించి, అందులో కొబ్బరి పాలు, పచ్చి యాలకుల పొడి వేసి మంచిగా కలపాలి. దీనిని మీడియం మంటపై సుమారు 10 నిమిషాల పాటు మెల్లగా ఉడకనివ్వాలి.
చివరగా, ఒక చిన్న పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి, అందులో నాలుగు జీడిపప్పులు, ఎండుద్రాక్షలను వేసి దోరగా వేయించి పాయసంలో కలుపుకుంటే కమ్మనైన బార్లీ పాయసం రెడీ.
Also Read: