SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవరాత్రి స్పెషల్ మొదటి రోజు కట్టు పొంగలి ఇలా తయారు చేసుకోండి..!

నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రతిరోజూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. అయితే, నైవేద్యంగా లేదా బ్రేకఫాస్ట్ కోసం అయినా మన బామ్మల కాలం నాటి నుంచి తయారు చేస్తున్న కట్టు పొంగలిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఆ రిసిపీ ఏంటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 10, 2026, 07:24 PM IST | Updated: Oct 10, 2026, 07:27 PM IST
Image Credit: Kattu Pongali Recipe
Join

Kattu Pongali Recipe: అక్టోబర్‌ 11వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఒక్కోరోజు అమ్మవారి ఒక్కో రూపాన్ని పూజిస్తాం.  ఈసమయంలో దేవికి ఇష్టమైన ప్రసాదాన్ని కూడా సమర్పిస్తాం. అయితే, కట్టుపొంగలి కూడా అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. చాలా సింపుల్‌గా ఈ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..
బియ్యం - ఒక్క గ్లాసు.
పెసరపప్పు -ఒక గ్లాసు
అల్లం
పచ్చిమిర్చి
కరివేపాకు
నెయ్యి
పోపు దినుసులు
రుచికి సరిపడా ఉప్పు

కట్టుపొంగలి తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోండి. ఈ రెండింటినీ బాగా కడిగేయండి. బియ్యం, పప్పు ఏ గ్లాసుతో తీసుకున్నారో, అదే గ్లాసుతో ఆరు గ్లాసుల నీళ్లు పోయండి. ఆ తర్వాత అర అంగుళం ముక్కలుగా కోసిన అల్లం, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పావు టీస్పూన్ జీలకర్ర వేయండి. ఇవి కూడా పప్పుతో పాటు ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.

పెసరపప్పుతో తయారు చేసిన ఈ రిసిపీ అయినా మంచి రుచి వస్తుంది. దీంతో స్వీట్ కూడా తయారు చేస్తారు. అంతేకాదు ఇది కడుపునకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది.
ఇప్పుడు రెండు టీస్పూన్ల మిరియాలను కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. దీంతో మంచి అరోమా వస్తుంది. ఈ కట్టుపొంగలి కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని బాగా కలిపి, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పొంగలిలో ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. లేకపోతే ఉప్పగా ఉంటుంది.

పొంగలి మీకు నేరుగా కావాలంటే ఇలాగే తినవచ్చు, ఒకవేళ ఇంకాస్త పల్చగా కావాలనుకుంటే ఇంకొక టీ గ్లాసు నీళ్లు పోసి కలపండి. ఇలా చేయడం వల్ల ఆరిన తర్వాత కూడా పొంగలి గట్టిపడకుండా మృదువుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్ లో ఉంచి కొంచెం సేపు ఉడికించండి.

తాలింపు కోసం..
పోపు కోసం ఒక కడాయి తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక అందులో అర టీస్పూన్ జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కోసిన అల్లం ముక్కలు, రెండు ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వండి. ఇవి నెయ్యిలో వేగితే మంచి వాసన, రుచి వస్తాయి. ఇప్పుడు ఇందులో మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇష్టమైన జీడిపప్పులు వేసి వేయించుకోండి. ఆ తర్వాత వెంటనే ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసి లైట్ గా వేయించండి. చివరగా రెండు రెమ్మల కరివేపాకు వేసి, అన్నీ మాడకుండా తక్కువ మంటపై వేయించండి.

Read Also: దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అర టీస్పూన్ పసుపు వేయండి. పసుపు వల్ల పొంగలికి మంచి రంగు, ఫ్లేవర్ వస్తాయి. అయితే, ఇక్కడ చాలామంది పసుపు వేయకుండా కూడా తింటారు. అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని పొంగలిలో వేసి బాగా కలపండి. అంతే, మీ కమ్మని కట్టు పొంగలి రెడీ అయిపోయింది. ప్రసాదాలకు ఈ పొంగలిని తయారు చేసుకుంటారు. కేవలం దసరా నవరాత్రులు మాత్రమే కాదు.. శనివారాల్లో కూడా వేంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెడతారు. మీరు కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో తయారు చేసుకోవచ్చు. ఇది మంచి రుచిగా ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES