భయాన్ని జయించడం ఎలా? ఆందోళన నుంచి బయటపడే బెస్ట్ థెరపీలు!
Overcome Fear: ప్రతి రోజు ఏదో ఒక సమయంలో తప్పకుండా భయపడుతూనే ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఆందోళన కూడా పడుతూ ఉంటారు. అయితే, వీటి రెండింటి మధ్య తేడాలు.. ముఖ్యంగా ఆందోళను తగ్గించుకోవడానికి ఎలాంటి థెరపీలు తీసుకోవాలో మెంటల్ హెల్త్ కోచ్ ప్రదీప్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం..
Overcome Fear: మనిషి జీవితంలో భయంతో పాటు ఆందోళన అనేవి అత్యంత సాధారణమైన భావోద్వేగాలు.. అయితే, చాలామంది ఈ రెండింటినీ ఒకేలా భావిస్తుంటారు.. కానీ, మెంటల్ హెల్త్ కోచ్ ప్రదీప్ అందించిన సమాచారం ప్రకారం, భయానికి, ఆందోళనకు మధ్య స్పష్టమైన తేడా ఉన్నాయి.. అసలు భయం ఎందుకు వస్తుంది? ఆందోళన ఎలా మొదలవుతుంది? వీటిని అధిగమించడానికి అందుబాటులో ఉన్న థెరపీల గురించి ఆయన మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు ఏదైనా ఆపద ఎదురైనప్పుడు మెదడు సహజంగా స్పందించే రక్షణ కవచమే భయం.. ఉదాహరణకు.. మన ఎదురుగా పాము కనిపించినా లేదా వేగంగా వస్తున్న వాహనం దగ్గరగా వచ్చినా మెదడులోని అమిగ్డాలా అనే భాగం వెంటనే అప్రమత్తమవుతుందని మెంటల్ హెల్త్ కోచ్ తెలిపారు. ఇది శరీరంలో అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేసి.. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. అంటే.. కళ్లముందు కనిపించే వాస్తవ ప్రమాదానికి కలిగే తక్షణ ప్రతిస్పందనే భయం..
భయం అనేది ప్రస్తుత క్షణంలో ఎదురయ్యే నిజమైన ముప్పుగా భావించస్తారని.. మెంటల్ హెల్త్ కోచ్ ప్రదీప్ తెలిపారు. ప్రమాదం తొలగిపోగానే భయం కూడా తగ్గిపోతుంది.. కానీ.. ఆందోళన అలా కాదు.. భవిష్యత్తులో ఏదో జరగబోతుందనే ఊహించుకునే ఆలోచనల వల్ల ఆందోళన కలుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతామోనని.. ఉద్యోగం పోతుందేమోనని లేదా అనారోగ్యం వస్తుందేమోనని ముందుగానే అతిగా ఆలోచించడం ఆందోళన కిందకు వస్తుందని మెంటల్ హెల్త్ కోచ్ వెల్లడించారు. భయం తక్షణ రక్షణకు ఉపయోగపడితే, దీర్ఘకాలిక ఆందోళన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు.
భయాన్ని, ఆందోళనను తగ్గించే థెరపీలు..
విపరీతమైన భయాలతో పాటు ఆందోళనలు రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తుంటే మానసిక నిపుణుల సహాయంతో కొన్ని థెరపీలు తీసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మెంటల్ హెల్త్ కోచ్ ప్రదీప్ తెలిపారు. ఇందులో ముఖ్యమైనది కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ.. మనలో కలిగే ప్రతికూలతో పాటు అన్ని రకాల ఆలోచనలను గుర్తించి.. వాటిని సానుకూల ఆలోచనలుగా మార్చుకోవడానికి ఈ థెరపీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఇక రెండవది ఎక్స్‌పోజర్ థెరపీ.. మనకు దేనిని చూస్తే భయమో.. సురక్షితమైన వాతావరణంలో క్రమంగా దానిని ఎదుర్కొనేలా శిక్షణ అందిస్తూ వస్తారు. దీనివల్ల మెదడుకు ఆ భయం పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
అలాగే మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్ థెరపీలు కూడా ఎంతగానో సహాయపడతాయి.. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల అద్బుతంగా జీవించడం అలవాటవుతుందని మెంటల్ హెల్త్ కోచ్ తెలిపారు. ఇది ఎంతో సులభంగా భవిష్యత్తు గురించిన ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా యాక్సెప్టెన్స్ అండ్ కమిట్‌మెంట్ థెరపీ కూడా ఎంతగానో సహాయపడుతుంది.. భయాలను తగ్గించేందుకు ప్రయత్నించకుండా.. వాటిని అంగీకరిస్తూనే మన లక్ష్యాల వైపు అడుగులు వేయడాన్ని ఈ చికిత్స క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
సేకరణ: మెంటల్ హెల్త్ కోచ్ ప్రదీప్
ఈ మెయిల్ ఐడీ: Pradeeptalks90@gmail.com