SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గోర్లు కొరికే అలవాటు ఉందా? ఈ షాకింగ్ ఘటన తెలిస్తే ఇక ఆ పని చేయరు!

Nail Biting Infection: ఎప్పటినుంచో మీకు కూడా గోర్లు కొరికే అలవాటు ఉందా? ఈ వార్త చదివితే తప్పకుండా ఆందోళన చెందుతారు. ఎందుకంటే గోర్లు కోరికే అలవాటు ఉన్న ఒక అమ్మాయికి గోర్లు కొరకడం అలవాటు ఉండడంతో చేతి వేలికి చిన్న గాయమై ఇన్ఫెక్షన్ గా మారిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 19, 2026, 01:51 PM IST | Updated: Sep 19, 2026, 01:53 PM IST
Image Credit: గోర్లు కొరికే అలవాటు ఉందా? ఈ షాకింగ్ ఘటన తెలిస్తే ఇక ఆ పని చేయరు!
Join

Nail Biting Infection In Telugu: సాధారణ ఒత్తిడిలో ఉన్నప్పుడో.. లేదా ఖాళీగా కూర్చున్నప్పుడు చాలామందికి గోర్లు కొలికే అలవాటు ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మొదలయ్యే ఈ అలవాటు చాలామంది పెద్ద విషయంగా పట్టించుకోకుండా ఉంటారు.. కానీ, చిన్న నిర్లక్ష్యమే ఒక నిండు ప్రాణాన్ని, శరీర అవయవాల అన్నింటిని ప్రమాదంలోకి నెట్టెయ్యగలుగుతుందని నిరూపించే షాకింగ్ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏళ్ల తరబడి గోర్లు కొరికే అలవాటున్న ఒక 21 ఏళ్ల యువతి.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఏకంగా తన వేలునే కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి..

సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడో, ఖాళీగా కూర్చున్నప్పుడో చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. చిన్నప్పటి నుంచి మొదలయ్యే ఈ అలవాటును చాలామంది పెద్ద విషయంగా పట్టించుకోరు. కానీ, ఈ చిన్న నిర్లక్ష్యమే ఒక నిండు ప్రాణాన్ని, శరీర అవయవాన్ని ప్రమాదంలోకి నెట్టగలదని నిరూపించే షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏళ్ల తరబడి గోళ్లు కొరికే అలవాటు ఉన్న ఓ 21 ఏళ్ల యువతి, తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారినపడి ఏకంగా తన వేలునే కోల్పోయే పరిస్థితికి చేరుకుంది.

సదర్ యువతికి గోళ్ల చుట్టూ ఉండే చర్మాన్ని కొరికే అలవాటు ఎప్పటినుంచో ఉందట.. ఈ క్రమంలో గోరు పక్కనే ఏర్పడిన చిన్నపాటి చర్మం పొర ఉన్నట్టుండి చిట్లిపోయి తీవ్రన నొప్పి మొదలైందట.. తొలుత చిన్నగా చికిత్స చేయించుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో పాటు ఇన్ఫెక్షన్ విపరీతంగా వేలు మొత్తం వ్యాపించింది. నొప్పితో పాటు వాపు భరించలేక ఆసుపత్రికి వెళ్ళగా.. వైద్యులు పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు..

ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చడంతో వేలును రక్షించేందుకు వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స నిర్వహించారట. ఇన్ఫెక్షన్ సోకిన కణజాలాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించారు. అయితే అదృష్టవశాత్తు సరైన సమయంలో సర్జరీ జరగడంతో వేలు పూర్తిగా తొలగించే ప్రమాదం తృటిలో తప్పిందని వైద్యులు తెలిపారు. చికిత్స జరిగిన తర్వాత కూడా కొన్ని రోజులపాటు నొప్పి అలాగే ఉండిపోయిందని సమాచారం..

వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. గోర్లను కొరకడం వల్ల గోరుచుట్టు ఉండే సహజ రక్షణ కవచం పూర్తిగా దెబ్బతిని పోతుంది. చర్మానికి కనిపించని సూక్ష్మ రంద్రాలతో పాటు గాయాలు విపరీతంగా ఏర్పడి. నోట్లోనే, చేతులపై ఉండే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా గాయాల ద్వారా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల పారోనిచియా అనే ఇన్ఫెక్షన్ సోకి గోరు ఉబ్బిపోవడంతో పాటు అందులో నుంచి చీము రావడం, నొప్పి విపరీతంగా పెరగడం వంటి లక్షణాలు వస్తూ ఉంటాయి..
 

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES