king Cobra Video: అనకాపల్లిలో షాకింగ్.. జనాల్ని హడలెత్తించిన 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో వైరల్..
13 foot king cobra in anakapalli: భారీ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అనకా పల్లి జిల్లా వి. మాడుగుల మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది.
13 foot long king cobra spotted in anakapalli: ఇటీవల తరచుగా అడవిలోని క్రూర జంతువులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చిరుతలు, ఎలుగు బంట్లు, పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రి పూట ఇవి జనాల మీద దాడులు చేస్తున్నాయి. ఇక పాములు, కొండ చిలువలు ఎలుకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ తిష్టవేసుకుని ఉంటాయి. ఈ క్రమంలో ఏపీలోని అనకాపల్లిలో భారీ గిరినాగు జనావాసాల్లోకి వచ్చి అందర్ని హడలెత్తించింది.ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలోని వి.మాడుగుల మండలంలో భారీ కింగ్ కోబ్రా ప్రజల్ని పరుగులు పెట్టించింది. స్థానికంగా కేజే పురం ప్రాంతం అడవికి దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలో తరచుగా అడవి నుంచి పాములు, కొండ చిలువలు జనావాసాల్లోకి వస్తాయి. తాజాగా.. 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా వచ్చింది. నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోకి కింగ్ కోబ్రా ప్రవేశించడంతో వెంటనే స్థానికులు భయంతో దూరంగా పరుగులు పెట్టారు.
స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ వెంకటేష్ రంగంలోకి గిరినాగును గంటల పాటు శ్రమించి ఎంతో చాకచక్యంగా దాన్ని బంధించాడు. అప్పటికే అది పలుమార్లు వారిపై బుసలు కొడుతూ కాటువేసేందుకు యత్నించింది. అయిన కూడా సదరు స్నేక్ క్యాచర్ జాగ్రత్తగా గిరినాగును బంధించడంతో అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు. పామును పట్టుకునే దృశ్యాలను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.