SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అరివీర భయంకరంగా దూసుకొస్తున్న అక్వాన్ తుపాను..

Akvan Toofan Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.. అత్యంత తీవ్ర తుపాన్‏గా మారుతోంది. అరవీర భయంకరంగా ఇది తీరం వైపు దూసుకొస్తుంది. అత్యంత తీవ్ర తుపానుగా గా మారిన తర్వాత తీరం దాటనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి బంగాళాఖాతానికి దక్షిణ దానికి అనుకొని తీవ్ర తుపానుగా ప్రకటించిన అధికారులు.. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం టైంలో ఇది ఏపీలోనే తీరం దాటనున్నట్లు తెలిపారు

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 05:34 IST | Updated: Nov 18, 2026, 09:53 IST
Image Credit: Akvan toofan
Join

Avkan toofan Effect: ఇది తమిళనాడులోని చెన్నైకి తూర్పున సుమారు 590 కి.మీ., శ్రీలంకలోని త్రింకోమలీకి ఈశాన్యంగా 630 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి ఆగ్నేయంగా 650 కి.మీ., విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 650 కి.మీ. మరియు ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈదురు గాలులు వీచే అవకాశం.. 

అత్యంత తీవ్ర తుఫాన్ మారుతున్న అక్వాన్.. తీరం దాటే సమయంలో ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్లు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు అధికారులు.శ్రీలంకలోని త్రింకోమలీకి ఈశాన్యంగా 630 కిలోమీటర్లు..ఒడిషాలోని గోపాల్ పూర్‌కు దక్షిణంగా 780 కిలో మీటర్ల దూరంలో ..  ప్రస్తుతం అక్వాన్ తీవ్ర తుఫాన్ చెన్నైకి తూర్పున 590 కిలోమీటర్ల దూరంలో.. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో...కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే స్పీడ్‎గా దీని ప్రయాణం ఉంటే.. నవంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్యానికి నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. విధ్వంసం సృష్టించొచ్చుని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

ఆక్వాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో తీవ్ర వర్షాలు..

అత్యంత తీవ్ర తుఫాన్ అక్వాన్ ప్రభావంతో.. 18వ తేదీన కోస్తాంధ్రలో వర్షాలు పడటం మొదలువుతాయని...19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇస్తూనే.. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి వచ్చేయాలని ఆదేశించింది.
ఏపీలో కోస్తాంధ్రలో 19వ తేదీ సాయంత్రం నుంచి 20వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలన్నారు.

నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటనున్నట్లు అంచనా..

ఆక్వాన్ తీరం దాటే సమయంలోనూ.. తీరం దాటిన తర్వాత అత్యంత భారీ వర్షాలు, పెను గాలులతో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని.. ప్రజలు అంతా అప్రమత్తంగా.. సురక్షితంగా ఉండాలని హెచ్చరించింది వాతావారణ శాఖ.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES