SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP First Phase Panchayat Elections: ఏపీలో తొలివిడత పంచాయతి ఎన్నికలు.. పలు చోట్ల హైటెన్షన్.. పోలీసుల లాఠీచార్జ్ .!.

AP Panchayat First phase Elections: ఏపీలోని పల్నాడు, నంద్యాల, తిరుపతి జిల్లా పరిధిలోని పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి కార్యకర్తల్ని చెదరగొట్టారు.

Written By Inamdar Paresh
Published: Nov 26, 2026, 11:02 IST | Updated: Nov 26, 2026, 11:22 IST
Image Credit: ap panchayat polling tension
Join

Andhra Pradesh First Phase Panchayat Elections 2026: ఆంధ్ర ప్రదేశ్ లో తొలి విడత పంచాయతీ  ఎన్నికల పోలింగ్ హీట్ నడుస్తొంది. ఈ క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఉదయం నుంచి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో పలు చోట్ల పోలింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  జొన్నలగడ్డలో పోలింగ్ సందర్భంగా.. వైసీపీ వారిని పోలింగ్ బూత్‌లోకి వెళ్లనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని  మహిళలు ధర్నాకు దిగారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతుందని కూడా ఆరోపణలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల్ని లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. అదే విధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

వైసీపీ మద్దతు దారులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ మద్దతు దారులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద కారం పొడి చల్లుకుని ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులు తాత్కాలికంగా పోలింగ్ ను నిలిపివేశారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం టి. కమ్మ పల్లి గ్రమా పంచాయతీలో ఎన్నికల బహిష్కరణ చేశారు. 

పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను కూర్చనొవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం. కర్నూల్ జిల్లా తురవగల్లులో ఎన్నిలకు గ్రామాస్తులంతా దూరంగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి డెవలప్ మెంట్ లేదని ప్రజలంతా ఆగ్రహంలో ఉన్నారు. గతంలో హమీలు ఇచ్చి మోసంచేశారని ప్రజలు ఈ విధంగా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్థలు గ్రామస్తులతో మాట్లాడి వారిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా జొన్నలగడ్డలో కూడా  పంచాయతీ ఎన్నికల వేళ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. 

వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతపురం రాప్తాడులోని ప్రనసన్నాయ పల్లిలో పంచాయతీ  ఎన్నికల వేళ ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో  2 బ్యాలెట్ పేపర్ల కట్టలు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వైసీపీ ఏజెంట్ చోరీ చేశాడని టీడీపీ ఆరోపణలు చేయడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES