• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు.. నేటి నుంచి 20 వరకు నామినేషన్లు..

ఏపీలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు.. నేటి నుంచి 20 వరకు నామినేషన్లు..

AP Panchayat Election 2nd Phase: ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక రెండో విడతలో మొత్తం 4 వేల 960 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ కండక్టర్ చేయనున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 09:05 IST|Updated: Nov 18, 2026, 12:15 IST
joinshare
ఏపీలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు.. నేటి నుంచి 20 వరకు నామినేషన్లు..
Image Credit: AP Local Body Election (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Local Body Election: ఆంధ్ర ప్రదేశ్ రెండో విడత పంజాయితీ ఎన్నికల్లో 4 వేల 960 మంది సర్పంచులు, 49, 224 మంది వార్డు సభ్యుల స్థానాలకు ఎలక్షన్స్  జరగనున్నాయి. సెకండ్ ఫేస్‌లో భాగంగా నేటి నుంచి  ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలిస్తారు.   నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధులకు ఛాన్స్  కల్పించారు. 23వ తేదీన అప్పీళ్లను పరిష్కరించనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణకు టైమ్ ఇచ్చారు.  అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.  

ఈ నెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు..

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అపుడే వెల్లడిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించి  అనంతరం రిజల్ట్ ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు..

గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోని ఘటనలపై పోలీసులు, ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు పకడ్బందీగా  నిర్వహించేందుకు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు.

పంచాయితీ ఎన్నికల వేళ.. 
పంచాయతీ ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి దుర్ఘ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే మోహరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పంచాయతీ నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  మున్సిపాలిటీ, ZPTC, MPTC ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలతో ఈ చర్యలు చేపట్టారు. . గత ఎన్నికల్లో వైసీపీ, కూటమి నేతల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు రిపీట్  కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
Pawan Kalyan
YS Jagan Mohan Reddy
BJP