• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /అనంతపురం జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!

అనంతపురం జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!

Crime News: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థిని పై ఓ ఉన్మాది రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థిని గోపిక లక్ష్మి ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు.

Written ByBhoomi
Published: Oct 31, 2026, 01:14 PM IST|Updated: Oct 31, 2026, 01:30 PM IST
joinshare
అనంతపురం జిల్లాలో  పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!
Image Credit: ap

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
చెప్పుడు మాటలు వింటే చెట్టంత మనిషికైనా చేటు తప్పదు అని చెబుతున్న నీతి కథ..!!

చెప్పుడు మాటలు వింటే చెట్టంత మనిషికైనా చేటు తప్పదు అని చెబుతున్న నీతి కథ..!!

2

Telangana Rain Alert: తెలంగాణలో ఎల్లో అలర్ట్..రాబోయే 5 రోజులు పిడుగులతో భారీ వర్షాలు..ఎక్కడెక్కడంటే?

3

నవంబర్‌లో బాక్సాఫీస్ దండయాత్ర.. హోల్‌సేల్‌గా థియేటర్స్‌లో మీడియం రేంజ్ టూ చిన్న చిత్రాలు..

4

AP Municipal Elections Polling: ఏపీలో రేపే మున్సిపాల్ ఎన్నికలు.. మీ పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది!

5

అనంతపురం జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 Crime News: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థిని పై ఓ ఉన్మాది రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థిని   గోపిక లక్ష్మి ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. 

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాలలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకున్నాయి.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడికి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ స్పందించారు. తరగతి గదిలోనే ఆ చిన్నారి రక్తపుమడుగులో పడివున్న దృశ్యం చూసి తన కన్నీళ్లు ఆగలేదని అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు ఒడిగట్టే వారిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేలా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లల భద్రతకు ఎవరు విఘాతం కలిగించినా.. ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read: 

పాఠశాల గదిలోనే క్రూరత్వం.. తోటి విద్యార్థినిపై బాలుడి వికృత దాడి.. స్పృహ కోల్పోయినా వదల్లేదు..  అసలేం జరిగిందంటే?

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
AP News