• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Chandrababu: సీఎం చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి మూడేళ్లు!

Chandrababu: సీఎం చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి మూడేళ్లు!

Chandrababu Naidu Recalls His 53 Days Prison Life: మూడేళ్ల కిందట జైలు జీవితం పొందిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జైలు నుంచి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 'ఎక్స్‌' వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 31, 2026, 09:41 PM IST|Updated: Oct 31, 2026, 09:44 PM IST
joinshare
Chandrababu: సీఎం చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి మూడేళ్లు!
Image Credit: Source: Chandrababu X (Twitter)

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Harish Rao: అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే రేవంత్ రెడ్డికే ఇవ్వాలి: హరీశ్‌ రావు

Harish Rao: అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే రేవంత్ రెడ్డికే ఇవ్వాలి: హరీశ్‌ రావు

2

Raptadu Incident Update: రాప్తాడు ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థినిని బెంగళూరు తరలింపు..మెరుగైన వైద్యం కోసం మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ!

3

Chandrababu: సీఎం చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి మూడేళ్లు!

4

Electricity Bill: ఏసీ రిమోట్‌లోని ఈ చిన్న బటన్.. మీ కరెంట్ బిల్లుని చాలా ఆదా చేస్తుంది!

5

Celebrity Chain Smokers: ధూమపానానికి బానిసలైన టాప్ హీరోయిన్స్ వీళ్ళే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chandrababu Prison Life: ఓ కేసులో జైలుకు వెళ్లి.. 53 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏసీ సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 'ఎక్స్‌' వేదికగా కీలక ప్రకటన చేశారు. నాటి రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం చేశారని.. తన రాజకీయ జీవితంలో అవి అత్యంత కఠిన రోజులు అని చెప్పుకొచ్చారు.

'నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు. 53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను' అని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారని.. కనీసం నోటీసు కూడా  ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు అని వెల్లడించారు.

'అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు.. యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.

'నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది' అని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

'నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలకు దిగారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు.. రైతుల నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు.. విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు.. సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం అని గుర్తుచేసుకున్నారు.

'రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబసభ్యులు నిజం గెలవాలి అని మీ వద్దకు వస్తే వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. 'నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన.. మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటా. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతా. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నా' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
Telugu News
AP News
Andhra Pradesh