• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Chandrababu naidu: సర్ నోటీసులపై ఈసీ క్లారిటీ.. ఎక్స్ వేదికగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే..?..

Chandrababu naidu: సర్ నోటీసులపై ఈసీ క్లారిటీ.. ఎక్స్ వేదికగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే..?..

CM Chandrababu naidu on ec sir: దేశంలోని ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. అంతే కాకుండా.. ఆయా పోలింగ్ బూత్ పరిధిలోని బీఎల్ వోలు ఓటర్ల ఇంటికి వచ్చి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకుంటారని స్పష్టం చేసింది.

Written ByInamdar Paresh
Published: Sep 26, 2026, 08:25 PM IST|Updated: Sep 26, 2026, 08:35 PM IST
joinshare
Chandrababu naidu: సర్ నోటీసులపై ఈసీ క్లారిటీ.. ఎక్స్ వేదికగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే..?..
Image Credit: ApcmChandrababu(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ap cm Chandrababu naidu tweet on ec of India SIR notices: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో  సర్ ప్రక్రియపై వస్తున్న అనేక అనుమానాలకు మరోసారి క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా.. ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. బీఎల్ వోలు  ఓటర్ల ఇంటికి వచ్చి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకుంటారని తెలిపింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి సమావేశమై పలు అంశాలపై  క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా.. సవరణ ప్రక్రియలో భాగంగా ఫారం-6కు జతపరిచే డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని పేర్కొన్నారు.

బీహార్, వెస్ట్ బెంగాల్‌తో సహా ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిందని ఈసీ తెలిపింది. జాబితాలో పేర్లు లేని వారు, యువత, మొదటి సారి తమ ఓటు హక్కు పొందిన వారు నిరంతర నమోదు ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అయితే.. ఈసీ తాజా నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా చేసిన ప్రకటనతో ప్రజల్లో నెలకొన్న అపోహలకు ముగింపు పలికిందన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్. ఎస్. సంధూ, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేసిందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని చంద్రబాబు ట్విట్ చేశారు. 

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమష్టిగా, సంస్థాగత విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమన్నారు. 

ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని.. బలమైన ప్రజాస్వామ్యంలో గెలుపును, ఓటమిని సమానంగా,  హుందాతనంతో స్వీకరించడం కూడా నాయకత్వ లక్షణమేనని చంద్రబాబు పేర్కొన్నారు. మన రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని.. భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యతని ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్ చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu