• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి, మాస్కులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవి కొన్ని రోజులు మాత్రమే ప్రభావం చూపుతాయి. ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులతోనే మనం సహజంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

Written ByRenuka Godugu
Published: Nov 22, 2026, 18:52 IST|Updated: Nov 22, 2026, 18:55 IST
joinshare
జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!
Image Credit: Methi and Curd Hair Mask:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

2

Hyderabad: హైదరాబాద్‌ను బాంబులతో పేల్చేస్తాం.. పోలీసులకు లష్కరే తొయిబా బెదిరింపు మెయిల్స్ .!.

3

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

4

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

5

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Methi and Curd Hair Mask: జుట్టు ఆరోగ్యంగా ఉండి, రాలిపోకుండా ఉండాలంటే కొన్ని ఇంటి వస్తువులు వాడటం సరిపోతుంది. కొబ్బరి నూనె, కరివేపాకు, ఉసిరి, మందార ఆకు వంటివి మన పూర్వీకుల కాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. వీటితోనే కాకుండా మెంతులతో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ మెంతులతో హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.

మెంతులను నానబెట్టి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. మెంతులతో నూనె తయారు చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది, తల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో సపోనిన్లు, ఆల్కలాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. మెంతులలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు జుట్టు ఆరోగ్యాన్ని బలపరుస్తాయి.

ఈ మెంతులతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నానబెట్టి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి.

ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టు అంతటికీ అప్లై చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయం పెరుగుతో కలిపి మెత్తగా బ్లెండ్ చేసి అప్లై చేయాలి.

కొన్ని రకాల అలర్జీ సమస్యలు ఉన్నవాళ్లు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది. అయితే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మెంతులు చాలామందికి మంచి ఫలితాలు ఇస్తాయి. మాస్క్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. అవసరమైతే షాంపూ కూడా ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది, తలచర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
మన రోజువారీ హెయిర్ కేర్‌లో కూడా మెంతులను ఉపయోగించుకోవచ్చు. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇందులో మ్యూసిలేజ్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఈ మాస్క్ వేయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది, చుండ్రు తగ్గుతుంది.

ఈ మెంతులతో నూనె కూడా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా మెంతులను కొబ్బరి నూనెలో వేసి, రంగు మారేవరకు గోరువెచ్చగా ఉడికించాలి. చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవచ్చు. ఈ మెంతు నూనెతో కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. (Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
daily life
Telugu News