• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Diwali Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక..నవంబరులో ఈ సరుకుల పంపిణీ!

AP Diwali Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక..నవంబరులో ఈ సరుకుల పంపిణీ!

Diwali Ration Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు పండుగ వేళ కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. బహిరంగ మార్కెట్లో ఎల్‌నివో ప్రతికూల ప్రభావాల వల్ల పంట దిగుబడులు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజల కుటుంబ బడ్జెట్ తలకిందులవుతున్న నేపథ్యంలో, దీపావళి కానుకగా సబ్సిడీ ధరలకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

Written ByHarish Darla
Published: Oct 29, 2026, 11:23 AM IST|Updated: Oct 29, 2026, 11:27 AM IST
joinshare
AP Diwali Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక..నవంబరులో ఈ సరుకుల పంపిణీ!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు..కిలోపై ఎంత తగ్గిందంటే..? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, నష్టమా?

ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు..కిలోపై ఎంత తగ్గిందంటే..? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, నష్టమా?

2

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. రేపు రాత్రి నింగిలోకి GSLV-F18 రాకెట్‌..

3

Konda Surekha: కేటీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. కొండా సురేఖ సంచలన ట్వీట్..!

4

నిర్మాతగా నిహారిక కొణిదెల దూకుడు.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీ..

5

AP Diwali Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక..నవంబరులో ఈ సరుకుల పంపిణీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali Ration Andhra Pradesh: పండుగ సమయంలో ఇళ్లలో కిరాణా సరుకుల అవసరం అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సరుకులను అత్యంత సబ్సిడీ ధరలకు అందించనుంది. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ధరల ప్రకారం.. బహిరంగ మార్కెట్లో అధికంగా ఉన్న కందిపప్పును కిలో కేవలం రూ. 100కే పంపిణీ చేస్తారు. అలాగే, గోధుమ పిండిని కిలో రూ. 25కు, పామాయిల్‌ను లీటరు రూ. 125కే డిపోల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పామాయిల్ సేకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక టెండర్లను కూడా ఆహ్వానించింది.

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయం..
ప్రస్తుతం బయట మార్కెట్లో సన్నబియ్యం ధర కిలో రూ. 100 వరకు ఉంటోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంచార (మొబైల్) వాహనాల ద్వారా 'ధరణి' బ్రాండ్ పేరుతో ఫైన్ రకం బియ్యాన్ని కిలో రూ. 49కి, సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ. 50కే విక్రయించనుంది.

మరోవైపు, రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ అసోసియేషన్లతో అధికారులు చర్చలు జరిపి బియ్యం ధరలను నియంత్రణలోకి తెచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం బీపీటీ స్టీమ్ రైస్ కిలో రూ. 66కు, సాధారణ స్టీమ్ రైస్ కిలో రూ. 47కు మించకుండా అమ్మడానికి మిల్లర్లు అంగీకరించారు.

రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు, నిఘా చర్యలు.. 
ఇప్పటికే రైతు బజార్లలో సన్నబియ్యంతో పాటు ఉల్లిపాయలను కిలో రూ. 35కే పంపిణీ చేస్తున్నారు. త్వరలోనే మరో 800 టన్నుల ఉల్లిపాయలను కూడా సబ్సిడీ ధరలకు అందించడానికి ప్రణాళిక రూపొందించారు.

రాష్ట్రంలో ధరల స్థితిగతులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, బియ్యం అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద నిఘా తీవ్రతరం చేయాలని ఆదేశించారు. మార్కెట్ సెస్సు భారాన్ని తగ్గించి, దీపావళి నాటికి ధరలు అదుపులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Ration Card
Telugu News