SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. 2,111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

AP DSC 2026: ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డీఎస్సీ 2026 ద్వారా మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

Written By Bhoomi
Published: Nov 19, 2026, 09:23 IST | Updated: Nov 19, 2026, 09:25 IST
Image Credit: AP DSC 2026:
Join

AP DSC 2026: ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డీఎస్సీ 2026 ద్వారా మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు.

మొత్తంలో పోస్టుల్లో ప్రభుత్వ,  జిల్లా పరిషత్, మండల పరిషత్ బడుల  పరిధిలో 1709 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లలో 402 పోస్టులున్నాయి. వీటిలో అత్యధికంగా 1,205 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. దీనిలో 1,069 జనరల్ కేటగిరి  కింద, 136 మున్సిపల్ పరిధిలోని ఖాళీలు ఉన్నాయి.

స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సబ్జెక్టుల వారీగా పరిశీలించినట్లయితే.. హిందీలో 202, సోషల్ స్టడీస్ లో 160 , బయోలాజికల్ సైన్స్ లో 151, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో 110 పోస్టులు ఉండగా.. తెలుగు, ఉర్దూ, తమిళం వంటి భాషలకు 110, ఇంగ్లీష్ కు 87, ఫిజికల్ సైన్సెస్ కు 45, గణితానికి 41 పోస్టులను కేటాయించారు.  

మొత్తం 2,721 ఖాళీలు ఉన్న DSC-2026 నోటిఫికేషన్ కింద ఈ 2,111 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అదనంగా, 350 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టులు, 260 రెసిడెన్షియల్,  మోడల్ స్కూల్ పోస్టులు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 20వ తేదీ నుండి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించబడతాయి. అర్హతలు .. దరఖాస్తు గడువులతో సహా పూర్తి సమాచారం కోసం అధికారిక పోర్టల్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES