Sukanya Samriddhi Yojana: ఆడపిల్ల పుట్టిందంటే చాలా మంది తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు. పెరుగుతున్న ఉన్నత చదువుల ఖర్చులు.. వివాహం, ఇతర జీవిత అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా నిధులు సమకూర్చుకోవడం నేడు ప్రతి కుటుంబానికి ఓ సవాలు అని చెప్పాలి. సురక్షితమైన రాబడులతోపాటు ప్రభుత్వ హామీ, ఆకర్షణీయమైన వడ్డీ, ట్యాక్స్ బెనిఫిట్స్ అందించే స్కీములు వైపు నేటి తరం మొగ్గు చూపిస్తోంది.
దీనిలో ప్రధానంగా ముందు వరుసలో నిలుస్తున్న స్కీమ్ సుకన్య సమ్రుద్ధి యోజన. నిర్దిష్ట కాలవ్యవధిలో స్థిరమైన పొదుపు తో భారీ మూలధనాన్ని ఎలా సమకూర్చుకోవచ్చునో.. అసలు ఈ స్కీమ్ తో రూ. 50లక్షలు, రూ. 75లక్షలు లేదా రూ. 1కోటి వరకు నిధిని పొందడం సాధ్యం అవుతుందా అనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆడపిల్లలకు 10ఏళ్ల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు సుకన్య సమ్రుద్ధి అకౌంట్ ను ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 15ఏళ్ల పాటు మాత్రమే డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. అయితే అకౌంట్ మాత్రం 21ఏళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. 15ఏళ్ల పాటు డబ్బు జమ చేయడం ఆగిపోయిన తర్వాత కూడా మిగిలిన 6ఏళ్ల కాలానికి అకౌంట్లోని మొత్తం బ్యాలెన్స్ పై నిరంతరం వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఈ దీర్ఘకాలిక కాంపౌండింగ్ ప్రయోజనమే పెట్టుబడిని రెట్టింపు కంటే ఎక్కువగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పాప ఉన్నత చదువుల కోసం ఆమెకు 18ఏళ్లు నిండిన తర్వాత అకౌంట్లోని బ్యాలెన్స్ నుంచి 50శాతం వరకు ముందస్తుగా ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
సుకన్య సమ్రుద్ధి స్కీములో ఒక ఆర్థిక ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది. ఒకవేళ సంవత్సరం గరిష్ట పరిమితి అయిన రూ. 1.5 లక్షలను వరుసగా 15సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా జమ చేస్తే .. 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం 21ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ. 70లక్షల వరకు భారీ డబ్బు సమకూరుతుంది. విశేషం ఏంటంటే.. ఈ కాలవ్యవధిలో లభించే వడ్డీ ఆదాయమే తల్లిదండ్రులు పెట్టిన అసలు పెట్టుబడి కంటే ఎక్కువగా ఉంటుంది.
మీ భవిష్యత్ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ముందుగానే ఒక స్థిరమైన మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటే.. మీ ప్రస్తుత ఆదాయం ఆధారంగా మీ నెలవారీ పెట్టుబడిని ఈ క్రింది విధంగా ప్రణాళిక చేసుకోవచ్చు:
రూ. 10 లక్షల కోసం: నెలకు సుమారుగా రూ. 1,800 జమ చేయండి.
రూ. 25 లక్షల కోసం: నెలకు సుమారుగా రూ. 4,500 పొదుపు చేయండి.
రూ. 50 లక్షల కోసం: క్రమం తప్పకుండా నెలకు సుమారుగా రూ. 9,000 జమ చేయండి.
రూ. 70 లక్షల కోసం: క్రమం తప్పకుండా నెలకు సుమారుగా రూ. 12,500 జమ చేయండి.
రూ. 1 కోటి కార్పస్‌ను నిర్మించడం సాధ్యమేనా?
కేవలం సుకన్య సమృద్ధి యోజన ద్వారా రూ. 1 కోటి కార్పస్‌ను నిర్మించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ పథకంలో సంవత్సరానికి రూ. 1.5 లక్షల పరిమితి ఉంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం గరిష్ట మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు జమ చేసినప్పటికీ, 21 సంవత్సరాలలో మెచ్యూరిటీ మొత్తం రూ. 1 కోటి కంటే తక్కువగానే ఉంటుంది. రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కార్పస్‌ను నిర్మించాలనుకునే వారు, సుకన్య సమృద్ధితో పాటు ఇతర దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
వడ్డీ రేటు, ఖాతా తెరిచే సమయం:
ఈ పథకంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవు. కేంద్ర ప్రభుత్వం వాటిని కాలానుగుణంగా సమీక్షిస్తుంది. 21 సంవత్సరాల కాలంలో, వడ్డీ రేటులో చిన్న మార్పు కూడా తుది మెచ్యూరిటీ మొత్తంలో లక్షల రూపాయల వ్యత్యాసానికి దారితీయవచ్చు. ఉదాహరణకు, వడ్డీ రేటు 7.7శాతం, 8.2శాతం, లేదా 8.5శాతం ఉన్నప్పుడు, తుది రాబడిలో వ్యత్యాసం గణనీయంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఖాతా తెరవడం వల్ల చక్రవడ్డీ ప్రభావం గరిష్టంగా ఉంటుంది. ఖాతా తెరిచి ఉంచిన సమయం పెరిగే కొద్దీ, చక్రవడ్డీ కాలం తగ్గి, తుది మెచ్యూరిటీ మొత్తం కూడా తగ్గుతుంది.
సుకన్య సమృద్ధి వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్:
PPF- ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి ప్రభుత్వ పథకాలతో పోలిస్తే, సుకన్య సమృద్ధి పన్ను రహిత మెచ్యూరిటీ ప్రయోజనంతో అత్యధిక రాబడిని అందిస్తుంది. అయితే, దీర్ఘకాలిక సంపద సృష్టి విషయానికి వస్తే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు అత్యుత్తమ ఫలితాలను అందిస్తాయని నిరూపించింది. అందువల్ల, ఆర్థిక నిపుణులు స్థిరమైన, రిస్క్-రహిత భద్రత కోసం బాలికల విద్యా పోర్ట్‌ఫోలియోలో సుకన్య సమృద్ధిని ప్రాథమిక ఎంపికగా చేర్చాలని, అధిక వృద్ధి కోసం దానిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు లేదా ఇండెక్స్ ఫండ్‌లతో సమతుల్యం చేయాలని సూచిస్తున్నారు.