CM Chandrababu naidu family cast vote in Ap Local panchayat elections: ఆంధ్ర ప్రదేశ్ లో తొలి దశ పంచాయతీ, మలి విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో 3,240 పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటింగ్ కోసం కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. 99.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
3,189 సర్పంచి, 25,101 వార్డు స్థానాలతో పాటు నాలుగు కార్పొరేషన్ల మేయర్, 19 మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్ పదవులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది.
ఏపీలోని ఉండవల్లిలో మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని 53వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
సీఎం చంద్రబాబుతో పాటు.. ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి కూడా ఇదే కేంద్రంలో తమ ఓటు వేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పుకొచ్చారు.