• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Solar Rooftop Target: ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ఏపీ ప్రభుత్వం బిగ్ న్యూస్..నెలాఖరుకు 9 లక్షల కనెక్షన్ల లక్ష్యం!

AP Solar Rooftop Target: ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ఏపీ ప్రభుత్వం బిగ్ న్యూస్..నెలాఖరుకు 9 లక్షల కనెక్షన్ల లక్ష్యం!

Andhra Pradesh Solar Rooftop Target: ఆంధ్రప్రదేశ్‌లో రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వేగవంతమైన సమగ్ర కార్యాచరణను ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం సూర్య ఘర్' పథకం అమలులో భాగంగా రాష్ట్రంలోని ఇళ్లతో పాటు పాఠశాలలు, హాస్టళ్లు వంటి వాటిపై సోలార్ ప్లేట్స్‌ను ఏర్పాటు చేసి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు 'గ్రీన్ ఎనర్జీ కారిడార్-3', పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

Written ByHarish Darla
Published: Nov 18, 2026, 19:18 IST|Updated: Nov 18, 2026, 19:22 IST
joinshare
AP Solar Rooftop Target: ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి ఏపీ ప్రభుత్వం బిగ్ న్యూస్..నెలాఖరుకు 9 లక్షల కనెక్షన్ల లక్ష్యం!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Andhra Pradesh Solar Rooftop Target: ఆంధ్రప్రదేశ్‌లో గృహాలపై సౌర విద్యుత్ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్య ఘర్' పథకం అమలులో ప్రస్తుతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఈ నెలాఖరు నాటికి రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్ల సంఖ్యను 9 లక్షలకు చేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారు. ఇళ్లతో పాటు 2,962 సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో సౌర పలకల ఏర్పాటు, పీఎం కుసుమ్ పురోగతి, పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు రూ.21,838 కోట్లతో 'గ్రీన్ ఎనర్జీ కారిడార్-3' నిర్మాణం, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ విధంగా ఇంధన శాఖ ప్రగతిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటికే 7.42 లక్షలకు పైగా గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, ఈ నెలాఖరు నాటికే 9 లక్షల కనెక్షన్లను అందించే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో సోలార్ విద్యుత్..
రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో (హాస్టళ్లలో) రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,962 విద్యాసంస్థలను సౌర విద్యుత్ పరిధిలోకి తీసుకురానున్నారు. మరోవైపు వ్యవసాయ విద్యుత్ లక్ష్యంగా సాగుతున్న 'పీఎం కుసుమ్' పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సౌర ప్లాంట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి 100 శాతం భూసేకరణ పూర్తి కాగా, 91 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు.

అలాగే ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 18.23 శాతం వృద్ధి చెందగా, రాబోయే ఆరు నెలల్లో గరిష్ఠ డిమాండ్ 14,852 మెగావాట్లకు చేరే అవకాశముంది. ఈ డిమాండ్‌ను సమర్థంగా అధిగమించడానికి, 47 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను చేరవేసే సామర్థ్యంతో రూ. 21,838 కోట్ల వ్యయంతో 'గ్రీన్ ఎనర్జీ కారిడార్-3' విద్యుత్ సరఫరా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు.

భారీ పెట్టుబడులు
రాష్ట్రంలో 36,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా పోలవరం పరిసర ప్రాంతాల్లోనే 27 పంప్డ్ స్టోరేజ్ ప్రాంతాలను గుర్తించారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు విద్యుత్ రంగంలో 103 ప్రాజెక్టులకు అనుమతులు లభించగా రూ. 4.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖ సమ్మిట్‌లో మరో రూ. 2.56 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని సమీక్షలో స్పష్టమైంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News