AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల సమరం.. షెడ్యూల్ విడుదల
AP Local Body Election Schedule Released By Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరానికి శంఖారావం మోగింది. ఈ ఎన్నికల ప్రకటనతో గ్రామీణ ప్రాంత రాజకీయాలు హాట్‌హాట్‌గా మారనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ఎప్పుడో తెలుసుకుందాం.
Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కించేలా ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. సుదీర్ఘ కాలంగా కసరత్తు చేసిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
అక్టోబర్ 18న నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు
అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
అక్టోబర్ 28న జీవీఎంసీ ఎన్నికల పోలింగ్
అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
రెండో దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 3న నిర్వహణ
నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
పూర్తి షెడ్యూల్ ఇదే
అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు
రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటిలో 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.
నామినేషన్లు
అక్టోబర్ 16 నుంచి 18 వరకు స్వీకరణ
అక్టోబర్ 21
నామినేషన్ల ఉపసంహరణ
అక్టోబర్ 26
ఎన్నికల ప్రచారం ముగింపు
అక్టోబర్ 28
పోలింగ్
అక్టోబర్ 30
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల
అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల దాఖలు
అక్టోబర్ 27
నామినేషన్ల ఉపసంహరణ
నవంబర్ 3
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
నవంబర్ 4
రీపోలింగ్
నవంబర్ 5
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు.
తొలి దశ
మొదటి దశ ఎన్నికలకు నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల
నవంబర్ 26
పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
రెండో దశ
నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల
నవంబర్ 29
పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
మూడో దశ
ఆఖరి దశ పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల
డిసెంబర్ 2
పోలింగ్, ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి