• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Panchayat Elections: ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్..నామినేషన్లు, పోలింగ్, ఎన్నికల ఫలితాలు అప్పుడే!

AP Panchayat Elections: ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్..నామినేషన్లు, పోలింగ్, ఎన్నికల ఫలితాలు అప్పుడే!

AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 21 నుంచి 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 24న పరిశీలన, 27న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు.

Written ByHarish Darla
Published: Nov 19, 2026, 12:31 IST|Updated: Nov 19, 2026, 12:46 IST
joinshare
AP Panchayat Elections: ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్..నామినేషన్లు, పోలింగ్, ఎన్నికల ఫలితాలు అప్పుడే!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 19న విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఈ షెడ్యూల్‌తో మూడో విడతలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 2న ఈ దశలో పోలింగ్ జరగనుంది.

మూడో దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నవంబర్ 21న ప్రారంభమవుతుంది. నవంబర్ 23 వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. నవంబర్ 24న రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్ చేసేందుకు నవంబర్ 25, 26 తేదీలను కేటాయించారు. ఈ అప్పీళ్ల పరిష్కారం అనంతరం అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి నవంబర్ 27 చివరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.

మూడో దశ ఎన్నికల ముఖ్యమైన తేదీలు..
> నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 21 నుంచి 23 వరకు
> నామినేషన్ల పరిశీలన: నవంబర్ 24
> తిరస్కరణపై అప్పీళ్లు: నవంబర్ 25, 26
> నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 27
> తుది అభ్యర్థుల జాబితా: నవంబర్ 27
> పోలింగ్: డిసెంబర్ 2
> అవసరమైతే రీపోలింగ్: డిసెంబర్ 3

పోలింగ్ రోజున ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహించేందుకు డిసెంబర్ 3ను కేటాయించారు.

మూడో దశలో ఎన్నికల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు నామినేషన్ సమర్పణకు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నామినేషన్ స్వీకరణ సమయాలు, పత్రాల వివరాలు, స్థానిక ఎన్నికల అధికారుల సూచనలను సంబంధిత రిటర్నింగ్ అధికారి లేదా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్ధారించుకోవాలి.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రమే కాకుండా ఓటర్లు కూడా తమ గ్రామానికి సంబంధించిన పోలింగ్ తేదీ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవడం అవసరం. తాజా సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections