SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..నెలకు రూ.15,000 జీతం..ఎందుకు?

AP Social Media Influencers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ఒక ప్రత్యేకమైన 'ఎంప్యానెల్‌మెంట్ పాలసీ'కి క్యాబినెట్ ద్వారా అధికారిక ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా, వేగంగా తీసుకువెళ్లడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. కంటెంట్ క్రియేటర్ల ఫాలోవర్లు, రీచ్, వ్యూస్, పనితీరు ఆధారంగా వారిని నాలుగు వేర్వేరు కేటగిరీలుగా విభజించి, ప్రతినెలా రూ. 2,500 నుండి రూ.15,000 వరకు ఆర్థిక చెల్లింపులు చేయనున్నారు.

Written By Harish Darla
Published: Sep 23, 2026, 09:19 PM IST | Updated: Sep 23, 2026, 09:22 PM IST
Join

AP Social Media Influencers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, విస్తృతంగా చేరవేసేందుకు ఏపీ క్యాబినెట్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా విశ్వసనీయమైన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లను గుర్తించి, వారిని ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయడానికి 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంప్యానెల్‌మెంట్ పాలసీ'కి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. డిజిటల్ వేదికల ద్వారా సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రత్యేక యాప్, అధికారిక ఐడీ కార్డులు
ఈ ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియను అత్యంత సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఈ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సమర్పించిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వెరిఫై చేసిన అనంతరం అర్హత సాధించిన ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం తరఫున అధికారిక ఐడీ కార్డులను అందజేస్తారు.

ఫాలోవర్లు ఆధారంగా కేటగిరీలు, నెలవారీ చెల్లింపులు 
వివిధ సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేసే వీడియోలు, పోస్టులకు వచ్చే వ్యూస్, ఫాలోవర్ల సంఖ్య, రీచ్, పనితీరు ప్రాతిపదికగా ఇన్‌ఫ్లుయెన్సర్లను వర్గీకరిస్తారు. ఆయా కేటగిరీల ప్రకారం ప్రతినెలా వారికి క్రింది విధంగా చెల్లింపులు జరుపుతారు.

కేటగిరీ 'ఏ': 1,00,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు నెలకు గరిష్ఠంగా రూ.15,000 చెల్లిస్తారు.

కేటగిరీ 'బీ': 50,000 నుండి 99,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారికి నెలకు రూ.7,500 ఇస్తారు.

కేటగిరీ 'సీ': 25,000 నుండి 49,999 వరకు ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లకు నెలకు రూ. 5,000 అందిస్తారు.

కేటగిరీ 'డీ': 10,000 నుండి 24,999 వరకు ఫాలోవర్లు ఉన్నవారికి నెలకు రూ. 2,500 చెల్లిస్తారు.

ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి వీడియోకు కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. ఈ నూతన ఎంప్యానెల్‌మెంట్ విధానం ద్వారా రాష్ట్రంలో అర్హత, విశ్వసనీయత ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ సమాచారాన్ని ప్రజల వద్దకు వేగంగా చేర్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES