SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఒక్కటి కాదు.. ఏకంగా 5 నోటిఫికేషన్లు ఇచ్చిన SLPRB!

నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొదటగా ఎస్సై, కానిస్టేబుల్‌ సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ తర్వాత వెంటనే మరో నాలుగు నోటిఫికేషన్‌లు వివిధ విభాగాల్లో SI, కానిస్టేబుల్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 16, 2026, 09:27 AM IST | Updated: Sep 21, 2026, 06:00 PM IST
Image Credit: AP Police Recruitment 2026
Join

AP Police Recruitment 2026: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నోటిఫికేషన్‌ల జాతర ఇక మొదలైంది. తాజా నోటిఫికేషన్ల ప్రకారం మొత్తం 378 సబ్‌-ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ SI విభాగంలో 253, ARలో 116, SPFలో 9 ఖాళీలు ఉన్నాయి. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 542, AR కానిస్టేబుల్ 285, ఫైర్‌మెన్ 158, పురుష జైల్ వార్డర్స్ 150, మహిళా జైల్ వార్డర్స్ 21 పోస్టులు ఉన్నాయి. అయితే, ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియతోపాటు ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.

ఇదే సమయంలో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ పోస్టులు మెన్‌, ఉమెన్‌ కేటగిరీలో భర్తీ చేయనుంది. మెకానిక్స్ విభాగంలో 15, డ్రైవర్ విభాగంలో 198 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రత్యేక ప్రకటనలు వెలువడ్డాయి. ఇది కేవలం మెన్‌కు మాత్రమే వర్తిస్తుంది. కమ్యూనికేషన్ విభాగంలో 50 SI పోస్టులు, ఇది మెన్‌, ఉమెన్‌ రెండు కేటగిరీలకు వర్తిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10 SI ఖాళీలకు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇది మాత్రం కేవలం మెన్‌ కేటగిరీలో భర్తీ చేయనుంది.

ఇక డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ ద్వారా సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌)-10 పోస్టులు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (కెమికల్‌) విభాగంలో -13, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (బయోలజీ లేదా సెరాలజీ)-20. మొత్తం 43 పోస్టుల భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/ లో సంబంధించిన నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలు..
ఏపీ పోలీస్‌ జాబ్‌ వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వద్ద సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయాలి.
పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, సిగ్నేచర్‌, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికేట్‌, కమ్యూనిటీ సర్టిఫికేట్‌ (SC/ST/BC), ఈడబ్ల్యూఎస్‌, నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్‌లో సైంటిఫిక అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కేవలం ఒక పోస్టు మాత్రమే సెలక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

 

READ ALSO: ఏపీకి వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌..  APSDMA కీలక హెచ్చరిక..

 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ, చివరి తేదీలు, ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్‌ను SLPRB త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, దరఖాస్తు వివరాలను తెలుసుకోవాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES