SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

APPSC Jobs 2026: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..ఏపీపీఎస్సీ నుంచి 20 నోటిఫికేషన్లు విడుదల..ఎన్ని పోస్టులున్నాయంటే?

APPSC Job Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఏపీపీఎస్సీ పరిధిలోని దాదాపుగా 892 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో గ్రూప్-1 సర్వీసుల్లో 163 పోస్టులు, ఇతర విభాగాల్లో 729 ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ రిక్రూట్‌మెంట్ పై ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు.

Written By Harish Darla
Published: Sep 17, 2026, 11:41 AM IST | Updated: Sep 17, 2026, 11:51 AM IST
Join

APPSC Job Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తీపికబురును అందించింది. ఏపీపీఎస్సీ కింద భారీగా ఉద్యోగ అవకాశాలను తాజాగా ప్రకటించింది. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 892 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్-1 సర్వీసుల కోసం 163 పోస్టులను విడుదల చేయగా.. ఇతర విభాగాల్లో 729 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను రిక్రూట్‌మెంట్ విభాగంలో అందుబాటులో ఉంచారు.

అయితే గతంలో జాబితాలో ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పోస్టులను మాత్రం తొలగించారు. అంతే కాకుండా జిల్లా పంచాయితీ అధికారి (డీపీఓ) పోస్టుల స్థానంలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎల్‌డీఓ) ఖాళీలను భర్తీ చేయనున్నారు. అదే విధంగా జాబితాలో చేర్చారు. ఇప్పుడు కొత్తగా గ్రూప్-1 సర్వీసెస్ జాబితాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కమ్యూనికేషన్స్, జిల్లా అధికారి (డీఈవో) పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు.

ఏపీపీఎస్సీలో విడుదల చేసిన తాజాగా నోటిఫికేషన్ ప్రకారం.. గ్రూప్-1తో పాటు ఫారెస్ట్, పరిశ్రమలు, మహిళాభివృద్ధి-శిశు సంక్షేమం, ఎండోమెంట్స్, ప్యాక్టరీస్, జూవైనైల్ వెల్ఫేర్, కాలుష్య నియంత్రణ మండలి, గిరిజన సంక్షేమం, ఆర్థిక గణాంకాలు, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాల్లో పోస్టులను ఈసారి భర్తీ చేయనున్నారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఏపీపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ జాబితాలో Notification No.07/2026 నుంచి 26/2026 అనేక రిక్రూట్‌మెంట్ ప్రకటనలు వెలువడ్డాయి. సాధారణ అభ్యర్థులకు వర్తించే గరిష్ఠ వయోపరిమితిని కూడా ఇంకో రెండేళ్లు పెంపుదల చేసిన ప్రభుత్వం అందులో పేర్కొంది. అయితే గతంలో వయోపరిమితి కారణంగా దరఖాస్తు చేయలేకపోయిన వారికి ఈసారి కొత్త నోటిఫికేషన్ల ద్వారా అవకాశం లభిస్తుంది.

జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వారివారి విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లతో పాటు ఇతర నిబంధనలకు సంబంధించిన అన్ని వివరాలను నోటిఫికేషన్ ద్వారా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. 

Also Read: 
విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు‌ వచ్చేసింది!

Also REad: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభం..30 ఏళ్ల నాటి కల సాకారం..

 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES