Arnab Cyclone: ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..
Ap cyclone Arnab effect: అర్నబ్ తుపాన్ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. సామాన్య ప్రజాజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈక్రమంలో రానున్న మరో వారం పాటు భారీగా నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
Heavy rain fall alert for ap next seven days: ఆంధ్ర ప్రదేశ్ లో అర్నాబ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు ప్రచండ గాలులతో సామాన్య జీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తున్నది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రచండ గాలులతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయితే అర్నాబ్ తుపాన్ మొత్తంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో తీరం దాటింది.
మరోవైపు ఏపీలో తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గెవరకు అధికారులు గ్రౌండ్ లెవల్ లో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రానున్న వారంరోజుల పాటు ఏపీలోని కోస్తాంధ్ర, యానంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని ఏపీ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోఉన్న వారు, మత్క్స కారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. మరోవైపు తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్దప్రాతికన చేపట్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అధికారులకు ఆదేశించారు.
ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలన్నారు. మరోవైపు, రాయలసీమలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అర్నబ్ తుఫాన్ బలహీనం..
అర్నాబ్ తుపాన్ మరో రెండు గంటల్లో బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. తీవ్ర తుఫాన్ నుంచి సాధారణ తుఫాన్‌గా మార్పు చెందుతుందని వెల్లడించారు. ఒకవేళ అర్ధరాత్రిలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం సైతం ఉందని అధికారులు తెలిపారు.
దీని వల్ల రానున్న 48 గంటలు ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ పయనించనుంది. తుఫాన్ తీవ్రత తగ్గినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు.