• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rajasthan: అయ్యో.. రూ. 20 కచోరీ తింటుంటే.. ఏకంగా 20 లక్షల బ్యాగ్‌తో దొంగలు పరార్.. వీడియో వైరల్..

Rajasthan: అయ్యో.. రూ. 20 కచోరీ తింటుంటే.. ఏకంగా 20 లక్షల బ్యాగ్‌తో దొంగలు పరార్.. వీడియో వైరల్..

Rs 20 lakhs bag steals in Jaipur: చంపాలాల్ అనే వ్యాపారి ఆకలిగా ఉందని కచోరీ కోసం ఆగాడు. ఇద్దరు ఆగంతకులు స్కూటీ మీద వచ్చి ఒక బ్యాగ్ ను తీసుకుని రెప్పపాటులో మాయమయ్యారు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 28, 2026, 06:59 PM IST|Updated: Oct 28, 2026, 07:20 PM IST
joinshare
Rajasthan: అయ్యో.. రూ. 20  కచోరీ తింటుంటే.. ఏకంగా 20 లక్షల బ్యాగ్‌తో దొంగలు పరార్.. వీడియో వైరల్..
Image Credit: jaipur man bag theft row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
PM Modi Congress MLC Polls: 4 రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..సోషల్ మీడియాలో దారుణంగా ప్రధాని మోదీ ట్రోలింగ్!

PM Modi Congress MLC Polls: 4 రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..సోషల్ మీడియాలో దారుణంగా ప్రధాని మోదీ ట్రోలింగ్!

2

Prabhu Deva: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా ప్రభుదేవా, సిమ్రాన్.. ‘కమల్ శ్రీదేవి’తో సందడి!

3

Rajasthan: అయ్యో.. రూ. 20 కచోరీ తింటుంటే.. ఏకంగా 20 లక్షల బ్యాగ్‌తో దొంగలు పరార్.. వీడియో వైరల్..

4

Arnab Cyclone: ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..

5

ఐటీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. చెన్నై నుంచి భాగ్యనగరానికి దిగ్గజ టెక్ సంస్థ.. భారీగా ఉద్యోగాలు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Thieves steals rs 20 lakhs while man eating kachori in Jaipur: ఇటీవల చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం ఎలాంటి పనులకైన వెనుకాడటంలేదు. కొంత మంది సోషల్ మీడియాలో మోసాలు చేస్తున్నారు. మరికొంత మంది బంగారం,డబ్బులు చోరీలకు పాల్పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల దుకాణాల్లో కస్టమర్లుగా వెళ్లి మరీ సీక్రెట్ గా బట్టలు, నగల్ని కాజేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై, బ్యాంక్ ల వద్ద కొంత మంది ఆగంతకులు రెడీగా ఉంటారు. ఏ మాత్రం నెగ్లీజెన్సీగా ఉన్న కూడా వెంటనే చోరీలకు పాల్పడుతుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది.

 

जयपुर के नाहरगढ़ थाना इलाके में एक व्यापारी को ₹20 की कचौड़ी खाना बेहद भारी पड़ गया, जब वह अपनी एक्टिवा पर ₹20 लाख से भरा बैग रखकर कचौड़ी खाने लगा। इसी बीच पीछे से आए दो बाइक सवार शातिर बदमाश पलक झपकते ही रुपयों से भरा बैग उड़ाकर फरार हो गए, जिसके बाद पुलिस CCTV फुटेज खंगाल कर मामले की जांच में जुट गई है... #Rajasthan #Jaipur #JaipurCrime #RobberyCase #Loot #RajasthanPolice #Nedricknews

— Nedrick News (@nedricknews) October 28, 2026

 


రాజస్తాన్ లోని జైపూర్ లో చంపలాల్ అనే వ్యాపారి ప్రతిరోజులాగే వివిధ దుకాణాల నుంచి డబ్బులను కలెక్ట్ చేసి  వెళ్తున్నాడు. అతని బ్యాగ్ లో 20 లక్షల రూపాయల ఉన్నాయి. అయితే.. పాపం చంపలాల్ కు ఆకలి వేయడంతో ఒక దుకాణం వద్ద తన స్కూటిని ఆపాడు. ఆ తర్వాత రూ. 20 పెట్టి కచోరీ తీసుకుని తింటున్నాడు. ఇంతలో  ఇద్దరు ఆగంతకులు హెల్మెట్ వేసుకుని అక్కడకు వచ్చారు. 

చంపలాల్ ను ఫాలో అయ్యి ఆయన కచోరీ తినడంను దూరంనుంచి గమనించారు. వెంటనే ఆయన స్కూటీ వద్దకు వెళ్లి ఏదో ఫోన్ చూస్తున్నట్లు చేసి పక్కన ఉన్న స్కూటీ మీద పెట్టిన రూ. 20 లక్షల బ్యాగ్ ను రెప్పపాటులో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైన వ్యాపారి చంపాలాల్ స్కూటీ మీద నుంచి దిగి గట్టిగా అరుస్తు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

 కానీ వారు హెల్మెట్లు పెట్టుకుని ఉన్నారు. అక్కడినుంచి వెంటనే స్పీడ్ గా వెళ్లిపోయారు.  వెంటనే వ్యాపారి చంపాలాల్ వెంటనే నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాను పరిశీలించారు. దానిలో దొంగల కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. అయితే వారు హెల్మెట్ పెట్టుకొవడం వల్ల వారి ముఖాలు మాత్రం రివీల్ కాలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Trending News