SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pulivendula ZPTC: వైఎస్ జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. పులివెందుల జెట్పీటీసీ టీడీపీ కైవసం..

AP MPTC ZPTC Counting: ఏపీ పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీ దూసుకుపోతుంది. మాజీ సీఎం జగన్ కు మరోసారి బిగ్ షాక్ ఎదురైంది. ఈ క్రమంలో స్థానికంగా జెట్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయ ఢంకా మోగించింది.

Written By Inamdar Paresh
Published: Nov 07, 2026, 12:39 PM IST | Updated: Nov 07, 2026, 12:51 PM IST
Image Credit: ys jagan (file)
Join

Kadapa Pulivendula zptc seat won by tdp candidate: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పరిషత్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఏపీలో ఇటీవల జరిగిన ఏపీ జెట్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే మున్సిపాలిటి ఎన్నికల్లో పులివెందులలో జగన్ కు ఊహించని పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్నీ టీడీపీ అభ్యర్థి గీతాకుమారీ గెల్చుకున్నారు. 

తన ప్రత్యర్థి వైఎస్ ప్రమీలపై 13 వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించి టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.  అదే విధంగా తాజాగా.. జరుగుతున్న ఏపీ జెట్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కూటమి భారీ స్థానాల్లో విజయాల్ని సాధించి దూసుకొని పోతుంది. ఇక పులివెందులలో జరిగిన జెట్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది.

ఈ క్రమంలోజెట్పీటీసీ  స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి విజయ ఢంకా మోగించింది. వైసీపీ అభ్యర్థి సావిత్రిపై ఏకంగా 1,467 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు.  దీంతో పులివెందులలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి వరుసుగా మునిసిపాలిటి అటు జెట్పీటీసీ  స్థానంను కోల్పొవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. మరోవైపు ఎంపీటీసీ స్థానంకౌంటింగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. కడప జిల్లా మైదుకూర్ జెడ్పీటీసీ స్థానంను టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి కృష్ణ కిషోర్  విజయం సాధించారు. 
 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES