Panchayat Election Results 2026: మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసిన అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడగా అధికార కూటమికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వెలువడుతున్న ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి పోటీగా వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటోంది. సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా జరగడంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య తీవ్ర పోటీ జరిగింది. టీడీపీ అత్యధిక సర్పంచ్ స్థానాలు సొంతం చేసుకోగా.. రమారమి అదే స్థాయిలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
ఏపీలో 3,949 పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేయగా.. వాటిలో 758 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3,240 పంచాయతీల్లో గురువారం ఎన్నికలు జరిగాయి. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు ఫలితాలు వెలువడుతుండగా అత్యధికంగా తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించగా.. అదే స్థాయిలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు కూడా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల తీరు ఇలా ఉంది.
చంద్రబాబు అడ్డాలో వైఎస్సార్‌సీపీ హవా
సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైఎస్సార్‌సీపీ భారీగా సర్పంచ్ స్థానాలు దక్కించుకుంది. కుప్పం మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. శాంతిపురం మండలం సొన్నేగానిపల్లి సర్పంచ్ శ్రీరాములు 27 ఓట్లు మెజారిటీతో గెలవగా.. కుప్పం మండలం మహమ్మద్ పురం సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన జె.నాసిర్ గెలిచారు. రామకుప్పం మండలం నారాయణపురం తండా సర్పంచ్‌గా చక్రియ నాయక్ 79 ఓట్లతో విజయం సాధించగా.. గుడిపల్లి మండలం చీకటిపల్లి సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన కస్తూరి మంజు 160 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
నంద్యాల జిల్లా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.
బిల్లలాపురం: టీడీపీ
కొత్తపల్లె: వైసీపీ
పెద్దకొట్టాల: వైసీపీ
అయ్యలూరు: వైసీపీ
చాపిరేవుల: టీడీపీ
పుసులూరు: వైసీపీ
మిట్నాల: టీడీపీ
బ్రాహ్మణపల్లె: టీడీపీ
చాబోలు: వైసీపీ
పోలూరు: టీడీపీ
పులిమద్ది: వైసీపీ
పాండురంగాపురం: వైసీపీ
రాయమల్పూరం: టీడీపీ
భీమవరం: టీడీపీ
గుంతనాల: టీడీపీ
గోస్పాడు మండలంలో టీడీపీ 9 సర్పంచ్ స్థానాలు సొంతం చేసుకోగా.. వైసీపీ ఆరు స్థానాలు కైవసం చేసుకున్నాయి.
దీబగుంట్ల: వైసీపీ
సాంబవరం: వైసీపీ
ఎం.చింతకుంట: టీడీపీ
జూలెపల్లె: టీడీపీ
గోస్పాడు: టీడీపీ
జిల్లెల: టీడీపీ
యాళ్లూరు: వైసీపీ
నెహ్రూ నగర్: వైసీపీ
ఓటివేలగల: వైసీపీ
రాయపాడు: టీడీపీ
తెల్లపూరు: టీడీపీ
కానాలపల్లె: టీడీపీ
ఏం.కృష్ణాపురం: టీడీపీ
పసురపాడు: వైసీపీ
నాగులవరం: టీడీపీ
తూ.గో, అంబేడ్కర్ జిల్లాల్లో..
తూర్పుగోదావరి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూటమికి చెందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఆధిక్యం చాటారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పరిషత్ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా పుంజుకుంది. 50 పంచాయతీల్లో టీడీపీ 13, జనసేన 3, వైఎస్సార్‌సీపీ 10 చోట్ల విజయం సాధించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ 53, జనసేన పార్టీ 23, వైఎస్సార్‌సీపీ 13, స్వతంత్రులు 10 చోట్ల గెలిచారు. మలికిపురం మండలం మట్టపర్రులో పుష్ప దర్శకుడు సుకుమార్ కుటుంబసభ్యుడు బండ్రెడ్డి శ్రీనివాసరావు కూటమి నుంచి సర్పంచ్‌గా గెలుపొందారు.
మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీ పల్లి మండలంలో టీడీపీ హవా నడించింది. పీసీపల్లి మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
వేపకంపల్లి గ్రామ సర్పంచ్‌గా పసుపులేటి కల్యాణి 14 ఓట్ల మెజార్టీతో విజయం
బట్టుపల్లి గ్రామ సర్పంచ్‌గా ఆండ్రా బాల అంకయ్య 106 ఓట్ల మెజార్టీతో గెలుపు
చోవటగోగులపల్లి గ్రామ సర్పంచ్‌గా సుగమంచు నాగభూషణం 54 ఓట్ల మెజార్టీతో విజయం
బడుగులేరు గ్రామ పంచాయతీలో అభ్యర్థి 150 ఓట్ల మెజార్టీతో విజయం
పీసీపల్లి గ్రామ పంచాయతీలోని మొత్తం 12 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం
పెద అలవలపాడు గ్రామ పంచాయతీలో 1,650 ఓట్ల మెజార్టీతో విజయం
మురిగిమి గ్రామ సర్పంచ్‌గా పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి 17 ఓట్ల మెజార్టీ విజయం
వెంగలాయపల్లి గ్రామ సర్పంచ్‌గా పులి మనీషా 26 ఓట్ల మెజార్టీతో విజయం