Municipal Corporations: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కలిసి కట్టుగా పోటీచేయాలని నిర్ణయించిన మహా కూటమి కొన్ని రోజులుగా సీట్ల పంపకంపై తీవ్ర చర్చలు జరిగాయి. కూటమి అధినేతల మధ్య చర్చలు జరిగిన అనంతరం.. గురువారం రాత్రి ఆ మూడు పార్టీలు పోటీ చేయడంపై ఒక నిర్ణయం తీసుకున్నాయి. చర్చలు కొలిక్కి వచ్చి మహా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకం పూర్తయ్యింది. మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన 4, బీజేపీ 2, 11 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయి.. పోటీ చేసే కార్పొరేషన్లను ప్రకటించింది.
జనసేన మునిసిపల్ కార్పొరేషన్
శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ
బీజేపీ
అనంతపురం, రాజమహేంద్రవరం
తెలుగుదేశం పార్టీ
ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు
మున్సిపాలిటీలు ఇలా..
మున్సిపాలిటీల సీట్ల సర్దుబాటు జరగ్గా.. తెలుగుదేశం పార్టీ 78 చోట్ల పోటీ చేయనుండగా.. జనసేన 21 స్థానాల్లో బరిలో దిగనుంది. బీజేపీ 7 మున్సిపాలిటీలకు పరిమితం కానుంది.