Bigg Boss 10 Elimination This Week: సెప్టెంబర్ 07న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విజయవంతంగా ఐదు వారాలను పూర్తి చేసుకుంది. మొదటి వారంలో చైత్ర, చరణ్ ఎలిమినేట్ కాగా, చరణ్‌కు బిగ్ బాస్ మరొక అవకాశం ఇచ్చారు. రెండవ వారం: కృష్ణుడు హౌస్ నుండి నిష్క్రమించాడు. మూడవ వారంలో ఎలిమినేషన్ లేనప్పటికీ, వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన మిథిలేష్ రెడ్డి క్యాష్ ప్రైజ్ తీసుకుని బయటకు వచ్చాడు. అలాగే నాలుగో, ఐదో వారంలో నాలుగో వారం సృష్టి ఎలిమినేట్ కాగా, ఐదో వారంలో చరణ్, అపూర్వ ఇద్దరూ ఒకేసారి ఎలిమినేట్ అయ్యారు.
ఆరో వారం నామినేషన్లు, ఓటింగ్ ట్రెండ్స్..
ఆరో వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లలో నిలిచారు. టెంపర్ వంశీ, రాంప్రసాద్, అమన్, శాలిని, వర్షిణి, రోహిత్ ఈ జాబితాలో ఉన్నారు. ఆన్లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం వర్షిణి, శాలిని డేంజర్ జోన్లో ఉన్నారు. వంశీకి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ, తాజా ఎపిసోడ్లో వచ్చిన సింపతి కార్డ్ కారణంగా అతను సేవ్ అయ్యే అవకాశాలు పెరిగాయి. దీంతో శాలిని, వర్షిణిలలో ఒకరు హౌస్‌ను వీడటం ఖాయంగా మారింది.
త్రిగుణ్ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
తాజా ఎపిసోడ్లో వర్షిణి తీవ్ర నిరాశతో త్రిగుణ్ వద్దకు వెళ్లి, అందరూ తానేశ ఎలిమినేట్ అవుతానని అంటున్నారని బాధపడింది. వంశీకి సింపతి వర్కవుట్ కావడంతో తానే బయటకు వెళ్తానని భయపడింది. దీనికి త్రిగుణ్ ధైర్యం చెప్తూ, "ఈ వారం నువ్వు ఎలిమినేట్ అవ్వవు.. నిన్ను సేవ్ చేసి శాలినిని బయటకు పంపించేస్తారు" అని స్పష్టం చేశాడు.
శాలిని హౌస్‌లో ఎక్కువగా అరుస్తుండటం, రోహిత్‌కి నీతూ తోడుగా ఉండటంతో శాలినిని పంపించేస్తే హౌస్‌లో గొడవలు తగ్గి గేమ్ బాగుంటుందని విశ్లేషించాడు. అంతేకాకుండా వర్షిణిని అద్దంలో చూపిస్తూ, ఈ ఇంట్లో ఇంత అందం, గ్లామర్ లేకుండా తాము ఎలా ఉండగలమని ప్రశ్నిస్తూ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.
ఆదివారం ఎపిసోడ్‌పై ఉత్కంఠ
త్రిగుణ్, వర్షిణిల మధ్య జరిగిన ఈ సంభాషణ క్లిప్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. త్రిగుణ్ చెప్పినట్లుగానే శాలిని ఎలిమినేట్ అవుతుందా లేదా వర్షిణి బయటకు వెళ్తుందా అనేది తేలాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.