SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kutami Candidates: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక పరిణామం.. కూటమి పోటీ చేసే సీట్లు ప్రకటన

Janasena 4 BJP 2 TDP Will Contest In 11 Municipal Corporations: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన కూటమి అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. పలు దశల చర్చల అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తన అభ్యర్థులను ప్రకటించింది. ఏయే పార్టీలు ఎక్కడ పోటీ చేస్తున్నాయో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Oct 15, 2026, 11:45 PM IST | Updated: Oct 15, 2026, 11:54 PM IST
Image Credit: TDP Janasena BJP Contest
Join

Municipal Corporations: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కలిసి కట్టుగా పోటీచేయాలని నిర్ణయించిన మహా కూటమి కొన్ని రోజులుగా సీట్ల పంపకంపై తీవ్ర చర్చలు జరిగాయి. కూటమి అధినేతల మధ్య చర్చలు జరిగిన అనంతరం.. గురువారం రాత్రి ఆ మూడు పార్టీలు పోటీ చేయడంపై ఒక నిర్ణయం తీసుకున్నాయి. చర్చలు కొలిక్కి వచ్చి మహా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించింది. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్ల పంపకం పూర్తయ్యింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో జనసేన 4, బీజేపీ 2, 11 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో  స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయి.. పోటీ చేసే కార్పొరేషన్లను ప్రకటించింది.

జనసేన మునిసిపల్‌ కార్పొరేషన్‌
శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ

బీజేపీ
అనంతపురం, రాజమహేంద్రవరం

తెలుగుదేశం పార్టీ
ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు

మున్సిపాలిటీలు ఇలా..
మున్సిపాలిటీల సీట్ల సర్దుబాటు జరగ్గా.. తెలుగుదేశం పార్టీ 78 చోట్ల పోటీ చేయనుండగా.. జనసేన 21 స్థానాల్లో బరిలో దిగనుంది. బీజేపీ 7 మున్సిపాలిటీలకు పరిమితం కానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES