SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chandrababu naidu: ఏపీపై అక్వాన్ తుపాన్‌ ప్రభావం.. రంగంలోకి సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు..

Akvan cyclone impact on andhra pradesh: ఇవాళ సాయంత్రానికి అక్వాన్ వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా బలపడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని అప్రమత్తం చేశారు.

Written By Inamdar Paresh
Published: Nov 16, 2026, 15:24 IST | Updated: Nov 16, 2026, 15:33 IST
Image Credit: chandrababunaidu(file)
Join

CM Chandrababu naidu key advice to officials on cyclone akvan: ఆంధ్ర ప్రదేశ్ ను ప్రస్తుతం వరుసగా తుపానుల గండం వెంటాడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే అర్ణబ్, మురసు ప్రభావాలతో ఏపీ అల్లకల్లోలంగా మారింది. వీటి వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి.   దీని నుంచి ఇంకా పూర్తిగా కొలుకొక ముందే మరోతుపాన్ ఏపీవైపుకు దూసుకుని వస్తుంది. ఈ  క్రమంలో అక్వాన్ తుపాన్ ప్రభావంపై వాతావరణ అధికారులు ఇప్పటికే కీలక అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం ప్రస్తుతం..  ఉత్తర వాయవ్య దిశగా కదలుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు సూచించారు. 

ప్రస్తుతం వాయుగుండం కదలికలు.. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు సౌత్ దిశలో 940 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఈ క్రమంలో అక్వాన్ తుపాన్ పై సీఎం చంద్రబాబు  అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై  ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.    ఇవాళ సాయంత్రానికి అక్వాన్ వాయుగుండంగా మారి ఆతర్వాత తీవ్రతుఫానుగా బలపడే సూచనలు ఉన్నట్టు తెలిపిన అధికారులు తెలిపారు. దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పలు సూచనలు చేశారు.   

 కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.    ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.    ఆర్నబ్ తరహాలోనే ఈ తుఫాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.     కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా వివిధ జిల్లాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వెల్లడించారు. మరోవైపు ఏపీ ప్రజలు సైతం అక్వాన్ తుపాన్ ప్రభావంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES