స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘన విజయం! ఓట్ల శాతంతో మైండ్ బ్లాకింగ్ వివరాలు వెల్లడించిన చంద్రబాబు!
స్థానిక ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో 55.3 శాతంగా ఉన్న కూటమి ఓటు వాటా ప్రస్తుతం 58.90 శాతానికి చేరిందని తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
CM Chandrababu Press Meet: ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ ఓట్ల శాతానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ బలం పుంజుకుందని ఆయన అన్నారు. అప్పట్లో 55.3 శాతంగా ఉన్న ఓట్ల శాతం ఇప్పుడు 3.6 శాతం పెరిగిందని చెప్పారు. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి 58.9 శాతం ఓట్ల శాతాన్ని సాధించిందని ఆయన తెలిపారు.
ఈ విజయం తమ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన ఆమోదమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. "గుడ్ గవర్నెన్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్" అని తాను నిరంతరం విశ్వసిస్తానన్నారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండియా కూటమి 59.9 శాతం ఓట్లు సాధించగా, స్ట్రైక్ రేట్ 94 శాతం అని అన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా నమోదైందన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూటమికి, వైఎస్సార్‌సీపీకి మధ్య 25.60 శాతం ఓట్ల తేడా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 17.9 శాతంగా ఉందని ఆయన ప్రకటించారు.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి, వైఎస్సార్‌సీపీకి మధ్య 25.34 శాతం ఓట్ల అంతరం ఉందని తెలిపారు. పట్టణాల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 59.9 శాతం, వైఎస్సార్‌సీపీ 34.3 శాతం, స్ట్రైక్ రేట్ 94 శాతం అని వివరించారు. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే, 9,818 స్థానాలకు గాను 7,830 స్థానాలను కూటమి దక్కించుకుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూడా కూటమి గెలుచుకుందని ఆయన తెలిపారు.
మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 575 స్థానాలు గెలుచుకుందని, రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యం సాధించిందని చంద్రబాబు నాయుడు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైఎస్సార్‌సీపీ కూటమికంటే ఎక్కువ సీట్లు సాధించిందని, మొత్తం ఏడు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీకి ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని చెప్పారు.
ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు అనే తేడా లేకుండా కూటమి ప్రభుత్వం గెలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి ప్రభుత్వ అభివృద్ధి పనులే కారణమని ఆయన అన్నారు. తుఫాను కష్టకాలంలోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రజలు ప్రభుత్వ కృషిని గుర్తించి మద్దతుగా నిలిచారని సీఎం తెలిపారు. అనకాపల్లి, కోనసీమ, మార్కాపురం, పశ్చిమ గోదావరి, పల్నాడు, విశాఖ జిల్లాల్లో వైఎస్సార్‌సీపీకి ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా రాలేదని ఆయన ప్రకటించారు.