• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /Pakistan TV Anchor Murder: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య.. ఇంట్లోనే తుపాకీతో దారుణంగా..భర్త అరెస్ట్!

Pakistan TV Anchor Murder: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య.. ఇంట్లోనే తుపాకీతో దారుణంగా..భర్త అరెస్ట్!

Pakistan TV Anchor Rabia Ahsan Murder: పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ యాంకర్ రబియా అహ్సాన్ రావల్పిండిలోని తన నివాసంలో తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ ఘటనలో ఆమె భర్త అహ్సాన్ తాహిర్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో కాల్పుల ఘటనపై అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందన్న అతడి వాదనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Written ByHarish Darla
Published: Nov 09, 2026, 03:50 PM IST|Updated: Nov 09, 2026, 03:55 PM IST
joinshare
Pakistan TV Anchor Murder: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య.. ఇంట్లోనే తుపాకీతో దారుణంగా..భర్త అరెస్ట్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Srisailam Karthika Masam: కార్తీక మాసం వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పరమశివుడి దర్శనం, సేవలపై కీలక మార్పులు!

Srisailam Karthika Masam: కార్తీక మాసం వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పరమశివుడి దర్శనం, సేవలపై కీలక మార్పులు!

2

Pakistan TV Anchor Murder: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య.. ఇంట్లోనే తుపాకీతో దారుణంగా..భర్త అరెస్ట్!

3

అదృష్టం అంటే ఇతనిదే.. చెత్త లోహాల కోసం వెళ్తే రూ.1.3 కోట్ల బంగారం దొరికింది!

4

Andhra Pradesh CPS to OPS: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. CPS నుంచి OPSకు మారేందుకు సర్వం సిద్ధం?!

5

గురు, కుజుల కలయికతో రాజయోగం.. 3 రాశుల ఉద్యోగులకు ప్రమోషన్లు, భారీ లాభాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pakistan TV Anchor Rabia Murder: పాకిస్థాన్‌లో మహిళా జర్నలిస్టుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ టెలివిజన్ యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్ రబియా అహ్సాన్ రావల్పిండిలోని తన నివాసంలో తుపాకీ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె భర్త అహ్సాన్ తాహిర్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పాకిస్థాన్ మీడియా సంస్థ SAMAA కథనం ప్రకారం.. ఆదివారం గుల్షనాబాద్ ప్రాంతంలోని ఇంట్లో రబియా అహ్సాన్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక పోలీసు విచారణలో ఆమె భర్త ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే, కాల్పులు ఉద్దేశపూర్వకంగా జరగలేదని, తుపాకీని ఉపయోగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ పేలిందని అతడు పోలీసులకు చెప్పినట్లు డాన్ (Dawn) నివేదించింది. పిస్టల్‌లో బుల్లెట్లు ఉన్న విషయం తనకు తెలియదని కూడా పేర్కొన్నాడు.

పోలీసుల విచారణలో కీలక ఆధారాలు
ఘటనాస్థలాన్ని సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీ (PFSA) బృందం ఆధారాలను సేకరించింది. కాల్పులకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రబియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇంట్లో పనిచేసే గృహ కార్మికుడు కూడా కాల్పులు ప్రమాదవశాత్తూ జరిగినట్లు ఖాన్ చెప్పాడని పోలీసులకు తెలిపినట్లు డాన్ కథనం వెల్లడించింది. ఈ వాదనల్లో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఎవరీ రబియా అహ్సాన్?
రబియా అహ్సాన్ వయస్సు 41 సంవత్సరాలు. ఆమె పాకిస్థాన్‌లోని 92 News టెలివిజన్ ఛానెల్‌లో యాంకర్‌గా, ప్రోగ్రామ్ హోస్ట్‌గా పనిచేశారు. ప్రముఖ జర్నలిస్టులు అమీర్ మతీన్, రౌఫ్ క్లాస్రాలతో కలిసి కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి సహ-వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆమెకు 13, 11 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో పిల్లలు తమ అమ్మమ్మతో కలిసి బయట ఉన్నట్లు సమాచారం.

అసీఫా భుట్టో దిగ్భ్రాంతి
రబియా అహ్సాన్ మృతిపై పాకిస్థాన్ ప్రథమ మహిళ అసీఫా భుట్టో- జర్దారీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఆగస్టులో రావల్పిండిలోనే డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ హీనా జావేద్ హత్యకు గురైన ఘటనను కూడా ఆమె ప్రస్తావించారు. మహిళలు తమ ప్రాణాలకు భయపడకుండా జీవించే, పనిచేసే పరిస్థితులు కల్పించాలని పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Pakistan
Telugu News
Crime News