• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Coca-Cola Investment In AP: ఏపీలో మరో భారీ పెట్టుబడి..రూ.1,127 కోట్లతో కోకాకోలా ఇండస్ట్రీ..ఎక్కడంటే?

Coca-Cola Investment In AP: ఏపీలో మరో భారీ పెట్టుబడి..రూ.1,127 కోట్లతో కోకాకోలా ఇండస్ట్రీ..ఎక్కడంటే?

Coca-Cola Investment In AP: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించే దిశగా ప్రముఖ అంతర్జాతీయ పానీయాల సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ లిమిటెడ్ (HCCBL) రూ.1,127 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (SIPC) ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు ద్వారా విజయనగరం, చిత్తూరు జిల్లాలలో కొత్త ప్లాంట్ ఏర్పాటు, విస్తరణ కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధితో పాటు రవాణా, ప్యాకేజింగ్ రంగాలలో వేలాది మందికి స్థానిక ఉపాధి లభించనుంది.

Written ByHarish Darla
Published: Sep 17, 2026, 04:03 PM IST|Updated: Sep 17, 2026, 04:09 PM IST
joinshare
Coca-Cola Investment In AP: ఏపీలో మరో భారీ పెట్టుబడి..రూ.1,127 కోట్లతో కోకాకోలా ఇండస్ట్రీ..ఎక్కడంటే?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Coca-Cola Investment In AP: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సమాన పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు హెచ్‌సీసీబీఎల్ తమ పెట్టుబడులను రెండు ప్రాంతాలకు కేటాయించింది. దీని ప్రకారం విజయనగరం జిల్లాలో కొత్త మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రూ.842 కోట్లను వెచ్చిస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఉత్పాదక కేంద్రాన్ని రూ.285 కోట్లతో మరింత ఆధునికీకరించి విస్తరించనున్నారు.

విజయనగరం ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం
విజయనగరంలో ఏర్పాటు చేయనున్న నూతన ప్లాంట్ ఉత్తరాంధ్ర పారిశ్రామిక విప్లవానికి చోదక శక్తిగా మారనుంది. తొలి విడతలో ఇక్కడ మూడు అత్యంత ఆధునిక బాట్లింగ్ లైన్లను నెలకొల్పి ఏడాదికి 1.8 కోట్ల కేసుల పానీయాలు, పండ్ల రసాలు, పోషక విలువలతో కూడిన టెట్రా-ప్యాక్ ఉత్పత్తులను సిద్ధం చేస్తారు. రెండో దశ విస్తరణ ద్వారా అదనంగా మరో రెండు లైన్లను పొందుపరిచి, మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 కోట్ల కేసులకు పెంచనున్నారు.

శ్రీకాళహస్తిలో..
శ్రీకాళహస్తి కేంద్రంలో రూ.285 కోట్ల వ్యయంతో ఒక అధునాతన ప్యాకేజ్డ్ వాటర్ లైన్, రెండు ప్రత్యేక కార్బొనేటెడ్ డ్రింక్ లైన్లను అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడి నుంచి కోకాకోలా, థమ్స్ అప్, స్ప్రైట్, ఫాంటా, లిమ్కా, కిన్లే వంటి ఉత్పత్తులను ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు తక్కువ రవాణా ఖర్చుతో సరఫరా చేస్తారు. దీనివల్ల వేల సంఖ్యలో ట్రక్కులు, కంటైనర్ల యజమానులకు నిరంతర రవాణా ఉపాధి లభిస్తుంది.

నూతన పారిశ్రామిక విధానాలు..
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 (2024-29), ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా లభిస్తున్న వేగవంతమైన అనుమతులు, రాయితీలు ఈ భారీ పెట్టుబడికి కారణమయ్యాయి. హెచ్‌సీసీబీఎల్ ప్లాంట్లు రైతుల నుంచి నేరుగా పండ్లను సేకరించడం వల్ల స్థానిక రైతులకు గిట్టుబాటు ధర లభించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది.

Also Read: 

దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!




Also Read: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు‌ వచ్చేసింది!

 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source