SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తీరం దాటుతున్న ఆక్వాన్ తుఫాను.. ఏపీకి తప్పిన పెను ముప్పు, కానీ ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఆక్వాన్ తుఫాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని ఎస్‌డీఎంఏ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తుఫాను బాహ్య వలయం తాకిందని పేర్కొంది. మరికొద్ది సేపట్లో ఒడిశాలోని గోపాల్ పూర్ సమీపంలో పూర్తిగా తీరం దాటనుందని వెల్లడించింది. ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదిలింది. దీని ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు, మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

Written By Renuka Godugu
Published: Nov 20, 2026, 09:02 IST | Updated: Nov 20, 2026, 09:04 IST
Image Credit: Cyclone Akvan Landfall Storm Begins:
Join

Cyclone Akvan Landfall Storm Begins: గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అన్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఒడిస్సాలో ఈ రోజు, రేపు అనేక చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఎట్టకేలకు ఈ తుఫాను తీరం దాటనుంది. రాష్ట్రానికి వారం రోజులుగా ఈ తుఫానుకు సంబంధించి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇది పలు ప్రాంతాల్లో తీరం దాటుతుందని చెప్పారు. నెల్లూరు దగ్గర తీరం దాటుతుందని, అదేవిధంగా కాకినాడ, విశాఖ మధ్య తీరం దాటుతుందని, కాకినాడకు సమీపంలోని ఉప్పాడ, గోరంగి మధ్య తీరం దాటుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ఈ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని కొద్దిసేపటి క్రితం ఎస్‌డీఎంఏ తెలిపింది.

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో తుఫాను బాహ్య వలయం తాకిందని చెబుతున్నారు. ఇది కొద్దిసేపట్లో ఒడిశాలోని గోపాల్ పూర్ సమీపంలో పూర్తిగా తీరం దాటుతుందని వెల్లడించారు. నిన్నటివరకు ఇది గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదిలినప్పటికీ, ఆరు గంటల్లో గంటకు 20-21 కిలోమీటర్ల వేగంతో కదిలిందని కూడా అధికారులు అంచనా వేశారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వివరించడం జరిగింది. ఈ తుఫాను ప్రభావం వల్ల ఆ ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఒడిస్సాలో ఈ రోజు, రేపు అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తీరం దాటుతున్న ఆక్వాన్ తుఫాను వల్ల ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఇది పూర్తిగా తీరం దాటినట్లుగానే అధికారులు అంచనా వేశారు. అయితే ఈ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలకు మాత్రం అతిభారీ వర్షాలతో పాటు గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఐదు రోజులుగా ఆక్వాన్ తుఫాను రాష్ట్రాన్ని పీడించింది. ప్రజలు, అధికారులు కూడా ఊపిరి సల్పకుండా ఏం జరుగుతుందో, ఏ ప్రాంతంలో దీని ప్రభావం చూపుతుందో అని ఆందోళన చెందారు. అంతటి తుఫాను స్థాయిలో దీని ప్రభావం ఉంటుందని భయపడటమే కాకుండా, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అదృష్టవశాత్తు రాష్ట్రానికి పెను ముప్పు తప్పిందనే చెప్పాలి. లేకపోతే అంచనా వేసిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపేదని అధికారులు భావించారు. ఇది మెల్లగా దిశ మార్చుకుంటూ వెళ్లడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన పరిస్థితుల వల్ల పూర్తిగా దిశ మార్చుకుని ఒడిస్సా తీరం వైపు వెళ్లిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. తుఫాను ముప్పు తప్పినట్లే. అయితే ఇది ఒడిశా తీరానికి వెళ్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల్లో, అదేవిధంగా దానికి ఆనుకున్న కాకినాడ జిల్లాల్లో మాత్రం కొంత మేర వర్షాలు పడతాయని చెబుతున్నారు. నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది, మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. ఈ వర్షాలు తప్ప ఇక తుఫాను ముప్పు లేదని, ఎలాంటి నష్టం జరగదని భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా పూర్తిస్థాయిలో అంచనా వేయడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఏ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది?
ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో, అలాగే కాకినాడ జిల్లాలో కొంత మేర మాత్రమే వర్షం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. ఇది పూర్తిగా ఒడిశా, గోపాల్ పూర్ వైపు వెళ్లిపోవడంతో రాష్ట్రానికి పెద్ద ముప్పు లేదు. మిగతా ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా వర్షం పెద్దగా ఉండదని ప్రకటించారు. ఈ ప్రాంతంలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES